త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCCI | కోహ్లి, రోహిత్ కు షాకిచ్చిన బీసీసీఐ.. గ్రూప్ B కి కాంట్రాక్టు మార్పు..

BCCI | బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) 2026 సంవ‌త్స‌రానికి గాను టీమిండియా సీనియర్ పురుషులు, సీనియర్ మహిళల వార్షిక ప్లేయర్ కాంట్రాక్టులను ప్రకటించింది. ఈ కాంట్రాక్టులు 2025 అక్టోబర్ 1 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయ‌ని బోర్డు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

S

Cricket | Published On Feb 10, 2026, 7.36 am IST

BCCI | కోహ్లి, రోహిత్ కు షాకిచ్చిన బీసీసీఐ.. గ్రూప్ B కి కాంట్రాక్టు మార్పు..
Advertisement

BCCI | బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) 2026 సంవ‌త్స‌రానికి గాను టీమిండియా సీనియర్ పురుషులు, సీనియర్ మహిళల వార్షిక ప్లేయర్ కాంట్రాక్టులను ప్రకటించింది. ఈ కాంట్రాక్టులు 2025 అక్టోబర్ 1 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయ‌ని బోర్డు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాగా ఈ సారి కాంట్రాక్టుల్లో బీసీసీఐ కీల‌క మార్పులు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు పురుషుల విభాగంలో ఉన్న ఎ ప్ల‌స్ కాంట్రాక్టును పూర్తిగా తొల‌గించింది. ఇక‌పై ప్లేయ‌ర్ల‌ను ఎ, బి, సి గ్రూపులుగా మాత్ర‌మే విభ‌జించి కాంట్రాక్ట్‌ల‌ను అంద‌జేయ‌నున్నట్లు తెలిపింది.

గ్రూప్ ఎ లో ముగ్గురే..

బీసీసీఐ తీసుకున్న ఈ కీల‌క నిర్ణ‌యంతో విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌లు టాప్ కాంట్రాక్టు లిస్ట్ లో చోటు కోల్పోయారు. అయితే దీనిపై బీసీసీఐ గ‌తంలోనే స్ప‌ష్ట‌త ఇచ్చింది. క‌నీసం రెండు ఫార్మాట్‌ల‌లో ఆడే సీనియ‌ర్ ప్లేయ‌ర్ల‌కు మాత్ర‌మే టాప్ కాంట్రాక్టులో చోటు క‌ల్పిస్తామ‌ని చెప్పింది. ఈ క్ర‌మంలో కోహ్లి, రోహిత్ ప్ర‌స్తుతం కేవ‌లం ఒకే ఫార్మాట్‌, అది కూడా వ‌న్డేల‌లోనే ఆడుతున్నారు. క‌నుక వారికి ఉన్న టాప్ కాంట్రాక్టును తొల‌గించి వారిని డిమోట్ చేసింది. వారిని గ్రూప్ బి కాంట్రాక్టు కింద జ‌త చేసింది. ఇక అన్ని ఫార్మాట్ల‌లో ఆడుతున్న శుబ‌మ‌న్ గిల్‌, జ‌స్‌ప్రిత్ బుమ్రాల‌కు గ్రూప్ ఎ కాంట్రాక్టులో బీసీసీఐ చోటు క‌ల్పించింది. అలాగే రూల్ ప్ర‌కారం రెండు ఫార్మాట్‌ల‌లో (టెస్టులు, వ‌న్డేలు) ఆడుతున్న సీనియర్ ప్లేయ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు సైతం గ్రూప్ ఎ కాంట్రాక్టులో అవ‌కాశం ఇచ్చారు.

సూర్య‌కుమార్, పాండ్యా కూడా గ్రూప్ బి లోనే..

గ్రూప్ బి కాంట్రాక్టులో రోహిత్, కోహిల‌తోపాటు వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, కేఎల్ రాహుల్‌, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌, హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్‌, కుల్దీప్ యాద‌వ్‌, య‌శ‌స్వి జైశ్వాల్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, శ్రేయాస్ అయ్య‌ర్ ల‌కు చోటు క‌ల్పించారు. అలాగే గ్రూప్ సి కాంట్రాక్టులో అక్ష‌ర్ ప‌టేల్‌, తిల‌క్ వ‌ర్మ‌, రింకు సింగ్‌, శివం దూబె, సంజు శాంస‌న్‌, అర్ష‌దీప్ సింగ్‌, ప్ర‌సిధ్ కృష్ణ‌, ఆకాష్ దీప్‌, హర్షిత్ రానా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శ‌ర్మ‌, సాయి సుద‌ర్శ‌న్‌, ర‌వి బిష్ణోయ్‌, రుతురాజ్ గైక్వాడ్‌ల‌కు చోటు ద‌క్కింది.

మ‌హిళ‌ల్లో గ్రూప్ ఎ లో న‌లుగురు..

టీమిండియా సీనియ‌ర్ మ‌హిళ‌ల వార్షిక కాంట్రాక్టుల వివ‌రాలు ఇలా ఉన్నాయి. గ్రూప్ ఎలో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌, స్మృతి మంధాన‌, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శ‌ర్మ‌ల‌కు చోటు క‌ల్పించ‌గా, గ్రూప్ బి కాంట్రాక్టులో రేణుకా ఠాకూర్‌, ష‌ఫాలి వ‌ర్మ‌, రిచా ఘోష్‌, స్నేహ్ రానాల‌కు చాన్స్ ఇచ్చారు. అలాగే గ్రూప్ సి లో రాధా యాద‌వ్‌, అమ‌న్‌జోత్ కౌర్‌, ప్ర‌తీకా రావ‌ల్‌, క్రాంతి గౌడ్‌, ఉమా ఛెత్రి, అరుంధ‌తి రెడ్డి, శ్రీ‌చ‌ర‌ణి, య‌స్తికా భాటియా, హ‌ర్లీన్ డియోల్‌, క‌శ్వీ గౌత‌మ్‌, జి.క‌మ‌లిని, వైష్ణ‌వి శ‌ర్మ‌, తేజ‌ల్ హ‌స‌బ్నిస్‌ల‌కు కాంట్రాక్టుల‌ను క‌ల్పించారు. ఓవ‌రాల్ గా చూస్తే బీసీసీఐ ఎ ప్ల‌స్ కాంట్రాక్టును పూర్తిగా తొల‌గించ‌డంతోపాటు ప్ర‌స్తుత ప్లేయ‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌, సీనియారిటీ, వారు ఆడుతున్న ఫార్మాట్ ప్రాధాన్య‌త వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈసారి కాంట్రాక్టుల‌ను కేటాయించింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement