త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mustafizur Rahman | బంగ్లా దుశ్చ‌ర్య ఎఫెక్ట్‌.. ఐపీఎల్ నుంచి ఆ ప్లేయ‌ర్ ఔట్‌..

Mustafizur Rahman | ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆడేందుకు గాను బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌ను అనుమ‌తిస్తారా, లేదా అన్న విష‌యంపై సందిగ్ధ‌త నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఆ దేశంలో హిందువుల‌పై దుశ్చ‌ర్య‌ను కొన‌సాగిస్తున్నార‌ని, అలాంట‌ప్పుడు ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌ను ఐపీఎల్‌లో ఎలా ఆడిస్తార‌ని ఫ్యాన్స్‌, దేశ ప్ర‌జ‌లు బీసీసీఐని ప్ర‌శ్నిస్తున్నారు.

S

Cricket | Published On Jan 3, 2026, 12.07 pm IST

Mustafizur Rahman | బంగ్లా దుశ్చ‌ర్య ఎఫెక్ట్‌.. ఐపీఎల్ నుంచి ఆ ప్లేయ‌ర్ ఔట్‌..
Advertisement

Mustafizur Rahman | ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆడేందుకు గాను బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌ను అనుమ‌తిస్తారా, లేదా అన్న విష‌యంపై సందిగ్ధ‌త నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఆ దేశంలో హిందువుల‌పై దుశ్చ‌ర్య‌ను కొన‌సాగిస్తున్నార‌ని, అలాంట‌ప్పుడు ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌ను ఐపీఎల్‌లో ఎలా ఆడిస్తార‌ని ఫ్యాన్స్‌, దేశ ప్ర‌జ‌లు బీసీసీఐని ప్ర‌శ్నిస్తున్నారు. మీకు దేశ ప్ర‌యోజ‌నాల క‌న్నా క్రికెటే ముఖ్య‌మా అని బీసీసీఐని విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విష‌యంపై స్పందించే వర‌కు ముస్తాఫిజుర్ ఆడే విష‌య‌మై నిర్ణ‌యం తీసుకోకూడ‌ద‌ని అంత‌కు ముందు బీసీసీఐ భావించింది. కానీ తాజాగా బీసీసీఐ ఈ విషయంపై త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌ను వెంట‌నే రిలీజ్ చేయాల‌ని, అత‌న్ని ఐపీఎల్‌లో ఆడించ‌వ‌ద్ద‌ని కోల్‌క‌తా నైట్ రైడర్స్‌కు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.

అత‌న్ని రీప్లేస్ చేసే ప్లేయ‌ర్ కేకేఆర్‌కు క‌ష్ట‌మే..

బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియా ఈ మేర‌కు ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌ను ఈ సీజ‌న్ ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయాల‌ని, అత‌న్ని ఈ సీజ‌న్‌లో ఆడించ‌వ‌ద్ద‌ని చెబుతూ కేకేఆర్ ఫ్రాంచైజీకి ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. అయితే ఒక విదేశీ బౌల‌ర్‌ను కోల్పోయిన కార‌ణంగా ఇంకో ప్లేయ‌ర్‌ను తీసుకునేందుకు కేకేఆర్‌కు అనుమ‌తినిస్తున్నామని తెలిపారు. ఈ క్ర‌మంలోనే ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయ‌డంతో కేకేఆర్‌కు గ‌ట్టి దెబ్బ ప‌డిన‌ట్లు అయింది. వాస్త‌వానికి ముస్తాఫిజుర్ టీ20ల‌లో డెత్ ఓవ‌ర్ బౌలింగ్ స్పెష‌లిస్టుగా పేరుగాంచాడు. త‌న‌దైన శైలిలో స్లో బాల్స్‌, క‌ట్ట‌ర్స్ వేస్తూ చివ‌రి ఓవ‌ర్ల‌లోనూ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తాడ‌ని, అలాగే స‌రైన టైములో వికెట్ల‌ను తీస్తూ జ‌ట్టుకు ఎంతో బ‌లాన్నిస్తాడ‌ని అత‌నికి పేరుంది. కానీ అత‌ను ఇప్పుడు దూర‌మ‌వ‌డంతో కేకేఆర్‌కు గట్టి దెబ్బే ప‌డింద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అత‌న్ని రీప్లేస్ చేసే ప్లేయ‌ర్ ఇప్ప‌టిక‌ప్పుడు ల‌భించ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు.

రూ.9.20 కోట్లు వెన‌క్కి..

అయితే ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయ‌నున్న నేప‌థ్యంలో కేకేఆర్‌కు మ‌రో ప్లేయ‌ర్ ఎవ‌రు ల‌భిస్తారు..? అన్న విష‌యం సందిగ్ధంగా మారింది. అత‌ని కోసం కేకేఆర్ చెల్లించిన రూ.9.20 కోట్ల‌ను తిరిగి వెన‌క్కి ఇచ్చేస్తామ‌ని బీసీసీఐ తెలిపింది. అయితే డ‌బ్బు చేతిలో ఉన్నా ఇంత త‌క్కువ వ్య‌వ‌ధిలో మ‌ళ్లీ ప్లేయ‌ర్‌ను వెదికి ప‌ట్టుకోవాలంటే కాస్త క‌ష్ట‌మైన ప‌నే. ఈ క్ర‌మంలోనే కేకేఆర్‌కు ఈ విష‌యంలో తిప్ప‌లు ఎదుర‌వుతాయ‌ని అంటున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యాల్లో ఫ్రాంచైజీల‌కు ప్లేయ‌ర్ల‌ను రీప్లేస్ చేసేందుకు కాస్త వెసులుబాటు క‌ల్పిస్తారు. దీంతో డ‌బ్బు కాస్త అటు ఇటు అయినా గిట్టుబాటు ధ‌ర‌కు ఇంకో మంచి ప్లేయ‌ర్‌ను ఎంపిక చేయ‌వ‌చ్చు. కానీ ఇప్పుడు ఐపీఎల్ కు చాలా త‌క్కువ వ్య‌వ‌ధి ఉంది. ఇలాంటి త‌రుణంలో ఇంకో మంచి ప్లేయ‌ర్‌ను వెద‌క‌డం క‌ష్ట‌మే అవుతుంది. మ‌రి కేకేఆర్ ఏం చేస్తుందో చూడాలి.

భార‌త్‌-బంగ్లా సిరీస్ అనుమాన‌మే..?

ఇక బంగ్లాదేశ్‌లో నెల‌కొన్న అనిశ్చితి, హింస, అల్ల‌ర్ల కార‌ణంగా గ‌తేడాది కూడా ఆ దేశంలో జ‌ర‌గాల్సిన భార‌త్‌-బంగ్లా సిరీస్‌ను ర‌ద్దు చేశారు. దీన్ని ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌కు వాయిదా వేశారు. అప్ప‌టి వ‌ర‌కు ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగి అంతా చక్క‌బ‌డుతుంద‌ని మాత్రం ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. దీంతో ఆ సిరీస్‌పై కూడా నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం ఈ సిరీస్ విష‌యంలో క‌ట్టుబ‌డి ఏమీ లేద‌ని స్ప‌ష్టం చేసింది. క‌నుక సిరీస్ జ‌ర‌గ‌డం అనుమాన‌మే అని భావించ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement