IPL Broadcast | బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలు.. నిషేధం ఎత్తివేసిన కొత్త ప్రభుత్వం..!
IPL Broadcast | బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాలపై వెనక్కి తగ్గింది. ఇప్పటి నుంచి దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయడంపై ఎలాంటి పరిమితులు ఉండవని స్పష్టం చేసింది.
IPL Broadcast | బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాలపై వెనక్కి తగ్గింది. ఇప్పటి నుంచి దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయడంపై ఎలాంటి పరిమితులు ఉండవని స్పష్టం చేసింది. ముందుగా ఉన్న నిషేధాన్ని రద్దు చేస్తూ, క్రీడలను రాజకీయ అంశాలుగా చూడకుండా, పూర్తిగా వాణిజ్య పరంగా మాత్రమే ఈ విషయాన్ని పరిగణిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ తెలిపారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జహీర్ ఉద్దీన్ మాట్లాడుతూ “ఇంతవరకు ఏవైనా సంస్థలు ఐపీఎల్ ప్రసారానికి మమ్మల్ని సంప్రదించలేదు. తాము క్రీడల్లో రాజకీయాలను మిళితం చేయాలని అనుకోవడం లేదు. ఏవైనా చానెల్‌లు ప్రసారానికి దరఖాస్తు చేస్తే సానుకూలంగా పరిశీలిస్తాం” అని చెప్పారు.
స్టార్ స్పోర్ట్స్ వంటి అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు ఐపీఎల్ ప్రసారం చేయాలనుకుంటే ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టమయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని బంగ్లాదేశ్ కేబుల్ ఆపరేటర్లు కూడా పాజిటివ్‌గా స్వాగతించారు. ఐపీఎల్ ప్రసారాలపై ఎలాంటి ఆంక్షలు ఇప్పుడు లేవని సంఘం కార్యదర్శి రెజాల్ కరీం లబ్లు తెలిపారు. “గత మధ్యంతర ప్రభుత్వ ఆదేశాలు ఇప్పుడు అమలులో లేవు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రమే ప్రసారాలను నిలిపివేసే హక్కు కలిగి ఉంది. కాబట్టి స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేస్తే, తాము దీన్ని కొనసాగిస్తాం” అని వివరించారు. మహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం, బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజంపై జరిగిన ఘటనల నేపథ్యంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించడంతో ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాన్ని నిలిపివేసింది. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిషేధాలు తొలగించింది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రసారాలకు ఇప్పుడు మార్గం సులభమైంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






