త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bangladesh | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ బ‌హిష్క‌ర‌ణ త‌ర్వాత.. బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

Bangladesh | బంగ్లాదేశ్‌లో (Bangladesh) నోబెల్ గ్ర‌హీత యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ భార‌త్ (India) వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్న విష‌యం తెలిసిందే.

G

Sports | Published On Jan 29, 2026, 7.24 am IST

Bangladesh | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ బ‌హిష్క‌ర‌ణ త‌ర్వాత.. బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: బంగ్లాదేశ్‌లో (Bangladesh) నోబెల్ గ్ర‌హీత యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ భార‌త్ (India) వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్న విష‌యం తెలిసిందే. సెవ‌న్ సిస్ట‌ర్స్‌గా పిలువ‌బ‌డే ఈశాన్య రాష్ట్రాల‌ను త‌మ భూభాగంలో చూప‌డం వంటి చ‌ర్య‌ల వ‌ల్ల ఇరు దేశాల మ‌ధ్య దౌత్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు కొన‌సాగుతున్నాయి. వ‌రుస‌గా హిందువుల‌పై దాడులు కొన‌సాగ‌డంపై భార‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్నాయి.

ఐపీఎల్ (IPL) నుంచి ఉన్న‌ప‌లంగా బంగ్లా క్రికెట‌ర్‌ను త‌ప్పించ‌డంతో పొరుగుదేశాల మ‌ధ్య దూరం ఇంకాస్తా పెరిగింది. ఈ నేప‌థ్యంలో భ‌ద్ర‌తా కార‌ణాల‌ను చూపుతూ వ‌చ్చే నెల 7 నుంచి జ‌రుగ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ కప్‌లో (T20 World Cup) ఆడేందుకు త‌మ క్రికెట్‌ జ‌ట్టును (cricket team) భార‌త్‌కు పంపేందుకు బంగ్లా స‌ర్కార్ ఒప్పుకోలేదు. దీంతో ఆ జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్‌ను బ‌హిష్క‌రించింది. అయితే తాజాగా బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ది.

త‌మ క్రీడాకారుల‌కు భార‌త్‌లో ర‌క్ష‌ణ లేద‌న్న యూనుస్ ప్ర‌భుత్వ‌మే.. తాజాగా షూటింగ్ జ‌ట్టును (Shooting Contingent) న్యూఢిల్లీకి పంపేందుకు నిర్ణ‌యించింది. వ‌చ్చే నెల 2 నుంచి 14 వ‌ర‌కు న్యూఢిల్లీ వేదిక‌గా ఆసియా లైఫిల్ అండ్ పిస్ట‌ల్ షూటింగ్ చాంపియ‌న్‌షిప్ జ‌రుగ‌నుంది. ఈ టోర్నీకి త‌మ బృందాన్ని బంగ్లాదేశ్ క్రీడా శాఖ‌ పంపించ‌నుంది.

త‌మది ఇద్ద‌రు స‌భ్యుల‌తో కూడిన‌ చాలా చిన్న బృందం అని, అందులో ఒక ప్లేయ‌ర్‌, కోచ్ మాత్ర‌మే ఉంటార‌ని స్పోర్ట్స్ సెక్రెట‌రీ మ‌హ‌బూబ్ ఆలం వెల్ల‌డించారు. భ‌ద్ర‌త‌కు ఎలాంటి ముప్పులేద‌ని నిర్వాహ‌కులు స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌డంతోనే త‌మ జ‌ట్టును భార‌త్‌కు పంపించ‌డానికి నిర్ణ‌యించామ‌న్నారు. క్రికెట్ ఓపెన్ గ్రౌండ్‌లో, చాలా మంది ప్రేక్ష‌కుల మ‌ధ్య ఆడుతార‌ని, షూటింగ్ అలా కాద‌న్నారు. చాలా త‌క్కువ మంది మ‌ధ్య‌, ఇండోర్ స్టేడియంలో ఈ క్రీడ‌ను నిర్వ‌హించ‌డం వ‌ల్ల బంగ్లా బృందాన్ని త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement