త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Austria vs Jordan | బోణీ చేసిన ఆస్ట్రియా.. జోర్డాన్‌పై 3-1 తేడాతో గెలుపు

Austria vs Jordan | గ్రూప్–జేలో ఆస్ట్రియా జట్టు బోణీ చేసింది. కాలిఫోర్నియా శాంటా క్లారాలో ఉన్న లెవీస్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన జోర్డాన్‌ను ఆస్ట్రియా 3-1 తేడాతో ఓడించింది. తొలి హాఫ్‌టైమ్‌లో రొమానో ష్మిడ్ అద్భుతమైన గోల్ సాధించి ఆస్ట్రియాకు ఆధిక్యం అందించాడు.

P

Sports | Published On Jun 17, 2026, 3.25 pm IST

Austria vs Jordan | బోణీ చేసిన ఆస్ట్రియా.. జోర్డాన్‌పై 3-1 తేడాతో గెలుపు
Advertisement

Austria vs Jordan | గ్రూప్–జేలో ఆస్ట్రియా జట్టు బోణీ చేసింది. కాలిఫోర్నియా శాంటా క్లారాలో ఉన్న లెవీస్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన జోర్డాన్‌ను ఆస్ట్రియా 3-1 తేడాతో ఓడించింది. తొలి హాఫ్‌టైమ్‌లో రొమానో ష్మిడ్ అద్భుతమైన గోల్ సాధించి ఆస్ట్రియాకు ఆధిక్యం అందించాడు. రెండో అర్ధభాగంలో జోర్డాన్ తరఫున అలీ ఒల్వాన్ సైతం గోల్ వేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే, కొద్దిసేపటికే జోర్డాన్ ఆటగాడు చేసిన ఓన్‌గోల్‌తో ఆస్ట్రియా మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆస్ట్రియా తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందిన మార్కో ఆర్నాటోవిచ్‌ను తుది జట్టులో ఆడించకపోయినా.. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దింపిన తర్వాత ఎక్స్‌ట్రా టైమ్‌లో పెనాల్టీని గోల్‌గా మలిచి విజయాన్ని ఖాయం చేశాడు. జట్టు కెప్టెన్ డేవిడ్ అలాబా ప్రపంచకప్ అర్హత పోటీల్లో చివరి రెండు మ్యాచ్‌లకు దూరమైనా.. ఈ మ్యాచ్‌లో జట్టులోకి తిరిగి వచ్చాడు. 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో ఆస్ట్రియా ఆడిన తొలి మ్యాచ్‌గా ఇదే కావడం విశేషం. జోర్డాన్ జట్టు తరఫున స్ట్రైకర్ అలీ ఒల్వాన్, కీలక వింగర్ మౌసా అల్-తమారి ఎటాకింగ్‌తో ఆటను ప్రారంభించారు. అయితే, క్వాలిఫికేషన్ స్టేజ్‌లో ఎనిమిది గోల్స్ సాధించిన మెయిన్ ఫార్వర్డ్ యజాన్ అల్-నైమాత్ మోకాలి గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.

Advertisement
Advertisement