France Vs Senegal | ఎంబాప్పే డబుల్.. ఫ్రాన్స్‌కు విజయం
France Vs Senegal | ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం సాధించింది. గ్రూప్–ఐలో జరిగిన మ్యాచ్‌లో సెనెగల్‌ను 3-1 తేడాతో ఓడించింది. కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే రెండు గోల్స్‌తో మెరిసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు.
- మెస్సీని అధిగమించిన ఎంబాప్పే
- ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ ఆటగాడిగా రికార్డు
- సెనెగల్‌పై 3-1 తేడాతో గెలుపు
France Vs Senegal | ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం సాధించింది. గ్రూప్–ఐలో జరిగిన మ్యాచ్‌లో సెనెగల్‌ను 3-1 తేడాతో ఓడించింది. కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే రెండు గోల్స్‌తో మెరిసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ ఆరంభం నుంచే సెనెగల్ దూకుడుగా ఆడింది. ఏడో నిమిషంలో ఇస్మాయిలియా గోల్‌కు దగ్గరగా వచ్చినా ఫలితం దక్కలేదు. 25వ నిమిషంలో నికోలస్ జాక్సన్ చేసిన ప్రయత్నం విఫలమైంది. తొలి అర్ధభాగంలో సెనెగల్‌కు పలు అవకాశాలు వచ్చినా వాటిని గోల్స్‌గా మార్చలేకపోయింది. మరోవైపు ఫ్రాన్స్ స్టార్ ఎంబాప్పే కూడా తొలి భాగంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో బ్రేక్ సమయానికి ఇరు జట్లు 0-0తో సమంగా నిలిచాయి.
సెకండాఫ్‌లో ఫ్రాన్స్ అద్భుతం..

అయితే, సెకండ్ హాఫ్‌లో ఫ్రాన్స్ గేమ్ మొత్తం మారిపోయింది. 47వ నిమిషంలో డిజైర్ డూయే, 53వ నిమిషంలో మైఖేల్ ఒలిసే చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా ఫ్రాన్స్ ఒత్తిడి పెంచింది. 66వ నిమిషంలో ఒలిసే ఇచ్చిన పాస్‌ను అందుకున్న ఎంబాప్పే అద్భుతంగా గోల్ చేసి జట్టుకు ఆధిక్యం తీసుకెళ్లాడు. సెనెగల్ డిఫెన్స్‌ను ఛేదించి గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి బంతిని నెట్‌లోకి పంపాడు. ఒక్కసారిగా ఆధిక్యంలోకి వచ్చిన ఫ్రాన్స్ ఆ తర్వాత దూకుడును కొనసాగించింది. 82వ నిమిషంలో బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ సాధించి స్కోరును 2-0కు చేర్చాడు. మ్యాచ్ ముగిసే సమయానికి ఎనిమిది నిమిషాల అదనపు సమయం ఇవ్వగా.. అందులో ఇబ్రహీం ఎంబాయే గోల్ చేసి సెనెగల్ జట్టులో ఆశలు రేపాడు. అయితే, వెంటనే ఎంబాప్పే మరో గోల్ సాధించి ఫ్రాన్స్ విజయాన్ని ఖాయం చేశాడు. చివరకు ఫ్రాన్స్ 3-1తో గెలుపొందింది.
రికార్డు బద్దలు కొట్టిన ఎంబాప్పే

ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన ఎంబాప్పే ప్రపంచకప్‌లో తన గోల్స్ సంఖ్యను 14కు పెంచుకున్నాడు. దీంతో ఫ్రాన్స్ దిగ్గజం జస్ట్ ఫాంటెయిన్ (13 గోల్స్) రికార్డును అధిగమించాడు. అలాగే, జర్మనీ మాజీ స్టార్ గెర్డ్ ముల్లర్ 14 గోల్స్ రికార్డును సమం చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో ప్రస్తుతం మిరోస్లావ్ క్లోజే (16), రొనాల్డో (15) మాత్రమే ఎంబాప్పే కంటే ఎక్కువ గోల్స్ సాధించారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో కూడా ఎంబాప్పే తన గోల్స్ సంఖ్యను 58కు పెంచుకొని ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Revanth Reddy | తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
- ●Norway vs Iraq | ఫిఫా ప్రపంచకప్‌లో నార్వే సంచలనం
- ●Ragging | ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. ఫైనల్ ఇయర్ విద్యార్థులు సస్పెండ్
- ●AIIMS Recruitment | ఎయిమ్స్‌లో 1484 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. జూన్ 30 వరకు దరాఖాస్తు గడువు
- ●మెస్సీ హ్యాట్రిక్.. ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా శుభారంభం
- ●Pani Puri | పానీపూరీ తిని 18 మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత..

Revanth Reddy | తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

Norway vs Iraq | ఫిఫా ప్రపంచకప్‌లో నార్వే సంచలనం

Ragging | ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. ఫైనల్ ఇయర్ విద్యార్థులు సస్పెండ్

AIIMS Recruitment | ఎయిమ్స్‌లో 1484 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. జూన్ 30 వరకు దరాఖాస్తు గడువు




