Arundhati Reddy | ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా అరుంధతిరెడ్డి
Arundhati Reddy | భారత మహిళల క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి ఫిబ్రవరి-2026 ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇది ఆమె కెరీర్‌లో తొలిసారిగా ఈ అవార్డును అందుకున్నది. ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచింది.
Arundhati Reddy | భారత మహిళల క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి ఫిబ్రవరి-2026 ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇది ఆమె కెరీర్‌లో తొలిసారిగా ఈ అవార్డును అందుకున్నది. ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచింది. ఈ అవార్డు దక్కడంపై ఫాస్ట్ బౌలర్ హర్షం వ్యక్తం చేసింది. ఇది తన జీవితంలో చాలా గర్వకారణమైన క్షణాలని పేర్కొంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ జట్టు విజయంలో తాను భాగం కావడం ఆనందంగా ఉందని, ఆస్ట్రేలియాను వారి హోం గ్రౌండ్‌లో ఓడించడం సులభం కాదని.. ఈ విజయానికి మరింత ప్రత్యేకత ఉందని చెప్పుకొచ్చింది.
ఆస్ట్రేలియాపై అరుంధతి మెరుపులు..
మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆరుంధతి రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసింది. మొత్తం ఎనిమిది వికెట్లను పడగొట్టడం ద్వారా ఆమె సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. బౌలింగ్ ఆవరేజ్ 10.87, ఎకనమీ రేట్ 7.25 కాగా.. అరుంధతి మెరుపు బౌలింగ్‌తో భారత్ సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచింది. 2016 తర్వాత ఆస్ట్రేలియాలో భారత మహిళల టీ20 సిరీస్‌లో తొలి సిరీస్‌ను నెగ్గడం విశేషం. సిడ్నీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో అరుంధతి కెరీర్‌లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసింది. 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్ల పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. కాన్‌బెర్రా మ్యాచ్‌లో 2/30, నిర్ణయాత్మక అడిలైడ్ మ్యాచ్‌లో 2/35తో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం భారత మహిళల దృష్టి టీ20 వరల్డ్ కప్పై పడింది. రాబోయే జూన్ 12 నుంచి ఇంగ్లాండ్-వేల్స్ వేదికగా మొదలుకానుంది.
https://x.com/BCCIWomen/status/2036028513799786789
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






