Arjun Tendulkar | ఎట్టకేలకు తొలి మ్యాచ్ ఆడిన అర్జున్ టెండుల్కర్
Arjun Tendulkar | క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) ఎట్టకేలకు లక్నో సూపర్ గెయింట్స్ (LSG) తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న అతడు బ్యాటింగ్, బౌలింగ్‌లో పరవాలేదనిపించుకున్నాడు.
Arjun Tendulkar | త్రినేత్ర.న్యూస్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) ఎట్టకేలకు లక్నో సూపర్ గెయింట్స్ (LSG) తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న అతడు బ్యాటింగ్, బౌలింగ్‌లో పరవాలేదనిపించుకున్నాడు. బ్యాటింగ్‌లో ఎనిమిదవ స్థానంలో వచ్చిన అర్జున్ 5 బాల్స్‌లో 5 రన్స్ చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఇక బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పగొట్టాడు. ఫీల్డింగ్‌లో కూడా ఓ క్యాచ్ పట్టాడు.

వాస్తవానికి అర్జున్‌కు రెండు వికెట్లు దక్కాల్సి ఉంది. పంజాబ్ (PBKS) బ్యాట్స్‌మెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ రిషబ్ పంత్ వదిలేశాడు. ఆ తర్వాత అతడు 49 రన్స్ చేశాడు. అయితే చివరకు అర్జున్ బౌలింగ్‌లోనే ప్రభ్‌సిమ్రన్ ఔటయ్యాడు. అతని వ్యక్తిగత స్కోర్ 69 పరుగుల వద్ద చక్కని యార్కర్‌తో అతడిని బోల్తాకొట్టించాడు. దీంతో ఐపీఎల్లో తొలి వికెట్‌ను దక్కించుకున్నాడు. అయినప్పటికీ ఎలాంగ్ సెలబ్రేషన్స్ లేకుండా కామ్‌గా ఉండిపోయాడు. ఇక ఇన్నింగ్స్ 17వ ఓవర్, తన చివరి ఓవర్లో అర్జున్ తన ఔలింగ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. కేవలం 5 రన్స్ మాత్రమే ఇచ్చి పంజాబ్ విజయాన్ని ఆలస్యం చేశాడు. లక్నో బౌలర్లలో ప్రదర్శణ కనబరిచాడు.

2023, 2024 సీజన్లో అర్జున్ ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. 2025లో ఎల్ఎస్జీకి మారిన అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సీజన్ ముగించాడు. ఇక ప్రస్తుతం జట్టు తన చివరి మ్యాచ్‌లో అర్జున్‌కి స్థానం కల్పించింది. ఓటమితోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Look at Arjun Tendulkar’s reaction after taking his first wicket completely calm, no shouting or aggressive celebration.🫡❤️
Arjun is very calm and composed, just like his father Sachin Tendulkar.🙌 pic.twitter.com/8jLm7UEAAy
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 23, 2026
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 6 వికెట్ల నష్టానికి 196 రన్స్ చేసింది. స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. మొదట్లో కొంచం తడబడినా ప్రభ్‌సిమ్రన్ (69), శ్రేయస్ అయ్యర్ (101) ధాటిగా ఆడటంతో 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.
Look at Arjun Tendulkar’s reaction after taking his first wicket completely calm, no shouting or aggressive celebration.🫡❤️
Arjun is very calm and composed, just like his father Sachin Tendulkar.🙌 pic.twitter.com/8jLm7UEAAy
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 23, 2026
వెల్ డన్ అర్జున్.. గర్వంగా ఉంది: సచిన్
సచిన్ టెండుల్కర్ పుత్రోత్సాహాన్ని చాటుకున్నారు. లక్నో తరఫున తొలి మ్యాచ్ ఆడిన అర్జున్ను పొగడ్తలతో ముంచెత్తారు. క్రికెట్ నైపుణ్యంతోపాటు ఓపికను కూడా పరీక్షిస్తుందని, నేడు నువ్వు ఆ రెండింటినీ గెలిచావ్ అంటూ ఎక్స్ వేదికగా అభినందిచారు.
`వెల్ డన్ అర్జున్. ఈ సీజన్ అంతా నువ్వు ప్రవర్తించిన తీరుపట్ల గర్వంగా ఉంది. ఎప్పుడూ నీ సామర్థ్యాన్ని నమ్ముతూ, ఓపికగా ఉంటూ, నిశ్శబ్దంగా కష్టపడుతూ, చివరి మ్యాచ్ వరకు అవకాశం కోసం వేచి ఉండాల్సి వచ్చినా సానుకూలంగా ఉన్నావు. క్రికెట్ నైపుణ్యంతో పాటు ఓపికను కూడా పరీక్షిస్తుంది, ఈరోజు నువ్వు ఆ రెండింటినీ అద్భుతంగా నిర్వహించావు. ఎప్పటిలాగే ఆటను ప్రేమిస్తూనే ఉండు. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా` అని సచిన్ తన సంతోషాన్ని పంచుకున్నారు. అర్జున్ గురించి సోషల్ మీడియాలో చాలా అరుదుగా సచిన్ పోస్టులు పెడుతుంటారు. చివరగా 2023లో ముంబై తరఫున ఐపీఎల్లో తొలి మ్యాచ్ అడినప్పుడు ఎక్స్ వేదికగా సచిన్ స్పందించారు. మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం!
Well done, Arjun. ❤️
Proud of the way you’ve carried yourself through this season, always believing in your ability, staying patient, working hard quietly, and remaining positive despite having to wait for your opportunity till the very last match.
Cricket tests patience as much… pic.twitter.com/3RdiGkXbfT— Sachin Tendulkar (@sachin_rt) May 23, 2026
సంబంధిత వార్తలు

IPL Playoffs | ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడతారంటే?.. షెడ్యూల్ ఇదే..
మే 25, 2026

Traffic Restrictions | హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారిమళ్లింపు
మే 6, 2026

IPL 2026 Playoff Scenario | రసవత్తరంగా ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు.. ముందంజలో నాలుగు జట్లు.. చెన్నైకి సవాల్.. ముంబయి కథ ముగిసినట్లే..!
మే 3, 2026
తాజావార్తలు
- ●Maach Bhaat Scheme | కేవలం రూ.5 కే రుచికరమైన 'చేపల భోజనం'.. పేదల కోసం సీఎం బంపరాఫర్
- ●Ranveer Singh | బ్యాన్ వేళ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ పూజలు - మరో వివాదానికి పుల్‌స్టాప్!
- ●Harish Rao | కొడంగల్ లంబాడీ బిడ్డలే రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడుతారు : హరీశ్‌రావు
- ●Pregnant Women | గర్భిణీలకు అలర్ట్.. థైరాయిడ్ ను నిర్లక్ష్యం చేస్తే పిల్లలకు ఏఎస్డీ ప్రమాదం..
- ●Devi Prasad | ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యలు నిలిపివేయాలి: దేవీప్రసాద్ డిమాండ్
- ●Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా

Maach Bhaat Scheme | కేవలం రూ.5 కే రుచికరమైన 'చేపల భోజనం'.. పేదల కోసం సీఎం బంపరాఫర్

Ranveer Singh | బ్యాన్ వేళ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ పూజలు - మరో వివాదానికి పుల్‌స్టాప్!

Harish Rao | కొడంగల్ లంబాడీ బిడ్డలే రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడుతారు : హరీశ్‌రావు

Pregnant Women | గర్భిణీలకు అలర్ట్.. థైరాయిడ్ ను నిర్లక్ష్యం చేస్తే పిల్లలకు ఏఎస్డీ ప్రమాదం..



