త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kollywood | హీరోయిన్‌గా మారిన పైల‌ట్ – కోలీవుడ్ సినిమాలో ఛాన్స్

విమానాన్ని న‌డిపే ఓ పైల‌ట్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ప్రార్ధ‌నా చాబ్రియా అనే పైల‌ట్ చిరో అనే త‌మిళ మూవీతో హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌బోతుంది. అక్టోబ‌ర్‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Sep 3, 2026, 7.54 pm IST

Kollywood | హీరోయిన్‌గా మారిన పైల‌ట్ – కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
Advertisement

Kollywood | యాక్ట‌ర్లుగా మారిన డాక్ట‌ర్లు ఇండ‌స్ట్రీలో చాలా మందే ఉన్నారు. సాఫ్ట్‌వేర్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన వారు క‌నిపిస్తారు. కానీ ఓ విమానాన్ని న‌డిపే పైల‌ట్ హీరోయిన్‌గా మార‌డం అన్న‌ది అరుదు. పైలట్ ప్రార్ధ‌నా చాబ్రియా హీరోయిన్‌గా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. చిరో పేరుతో ఓ త‌మిళ సినిమా చేస్తోంది. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

యాక్టింగ్‌లో ట్రైనింగ్‌...

ట్రైన‌ర్ గ్రేడ్ పైల‌ట్‌గా, పైల‌ట్‌గా ప‌నిచేసిన ప్రార్ధ‌నా చాబ్రియా న‌ట‌న‌పై ఆస‌క్తిగా యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంది. ఆదిశ‌క్తి అనే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయ్యింది. శిక్ష‌ణ కంప్లీట్ కాక‌ముందే ఓ సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకుంది.

బెల్లీ డ్యాన్స్‌....

ప్రార్థనా చాబ్రియా నటనతో పాటు పోల్ డ్యాన్స్, బెల్లీ డ్యాన్స్‌లోనూ మంచి ప్రావీణ్యం కలిగి ఉంది. .సింథి, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల‌పై ప‌ట్టు ఉంది. చిరో కోసం సొంతంగా డ‌బ్బింగ్ కూడా చెప్పుకోబోతుంది. ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న చిరో మూవీకి వివేక్ రాజారామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అక్ష‌య్ రాధాకృష్ణన్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అక్టోబ‌ర్‌లో ఈ త‌మిళ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

Advertisement
Advertisement