త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet | సెప్టెంబ‌ర్ 6న తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Telangana Cabinet | తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడెప్పుడా అని ఆశావ‌హులు ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యం రానే వ‌చ్చేసింది. ముహుర్తం కూడా ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. ఈ నెల 6వ తేదీన కేబినెట్ విస్త‌ర‌ణకు సీఎం రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

S

Telangana | Published On Sep 3, 2026, 7.44 pm IST

Telangana Cabinet | సెప్టెంబ‌ర్ 6న తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!
Advertisement

Telangana Cabinet | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడెప్పుడా అని ఆశావ‌హులు ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యం రానే వ‌చ్చేసింది. ముహుర్తం కూడా ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. ఈ నెల 6వ తేదీన కేబినెట్ విస్త‌ర‌ణకు సీఎం రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. లోక్‌భ‌వ‌న్ వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు స‌మాచారం.

ఆ ముగ్గురికి మంత్రి ప‌ద‌వి

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా టీ పీసీసీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు, స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు, మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి మంత్రి ప‌ద‌వి వ‌రించ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

హ‌డావుడిగా ఆదివార‌మే ఎందుకంటే..?

అయితే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఆదివార‌మే ఎందుకు విస్త‌రిస్తున్నారంటే.. సెప్టెంబ‌ర్ 7 నుంచి అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ ముగ్గురికి మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించి శాఖ‌లు క‌ట్ట‌బెడితే.. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం బ‌లంగా ఇవ్వొచ్చ‌నే అభిప్రాయంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఒకరు ఎస్సీ, మ‌రొక‌రు బీసీ, ఇంకొక‌రు రెడ్డి

ఈ ముగ్గురు నేత‌లు కూడా మంత్రి ప‌ద‌వి కోసం హ‌స్తిన‌లో గ‌త కొద్దిరోజుల నుంచి పైర‌వీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ముగ్గురిలో ఒక‌రు ఎస్సీ సామాజిక వ‌ర్గం, మ‌రొక‌రు బీసీ, ఇంకొక‌రు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఉన్నారు.

ఇంకా ఒక కేబినెట్ బెర్త్ ఖాళీ

ప్ర‌స్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో 14 మంది మంత్రులుగా కొన‌సాగుతున్నారు. సీఎంను క‌లిపితే ఆ సంఖ్య 15 అవుతుంది. తాజాగా కొండా సురేఖ‌ను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో.. ఆ సంఖ్య 14కు చేరింది. ఆదివారం గ‌డ్డం ప్ర‌సాద్, మ‌హేశ్ గౌడ్, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తే మంత్రుల సంఖ్య 17కు చేరుతుంది. ఇంకా మిగిలి ఉన్న ఒక కేబినెట్ పోస్టు ఎవ‌ర్నీ వ‌రిస్తుందో వేచి చూడాలి.

Advertisement
Advertisement