త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Sushmita Patel | మా అమ్మ‌ను రేవంత్ రెడ్డి అవ‌మానించారు

Konda Sushmita Patel | ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా అమ్మ‌ను సీఎం రేవంత్ రెడ్డి అవ‌మానించార‌ని కొండా సుస్మిత ప‌టేల్ పేర్కొన్నారు. త‌న త‌ల్లి కొండా సురేఖ‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన అనంత‌రం సుస్మిత స్పందించారు.

S

Telangana | Published On Sep 3, 2026, 9.55 pm IST

Konda Sushmita Patel | మా అమ్మ‌ను రేవంత్ రెడ్డి అవ‌మానించారు
Advertisement

తల్లి బర్తరఫ్‌పై కొండా సుస్మిత రియాక్షన్

Konda Sushmita Patel | త్రినేత్ర‌.న్యూస్ : ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా అమ్మ‌ను సీఎం రేవంత్ రెడ్డి అవ‌మానించార‌ని కొండా సుస్మిత ప‌టేల్ పేర్కొన్నారు. త‌న త‌ల్లి కొండా సురేఖ‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన అనంత‌రం సుస్మిత స్పందించారు.

కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేత‌ల‌ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు.. ఒక వ్య‌క్తికి వ్య‌తిరేకంగా మాత్ర‌మే మాట్లాడాను. బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనప్పుడు.. కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎలా అరెస్టు చేస్తామని రేవంత్ అన్నారు. మరీ.. నేను చేసిన వ్యాఖ్యలకు మా అమ్మను ఎలా బలి చేస్తారు అని సుస్మిత ప‌టేల్ నిల‌దీశారు.

రేవంత్ రెడ్డి.. వన్ టైం జ‌డ్పీటీసీ, వన్ టైం ఎమ్మెల్సీ, వన్‌టైమ్ ఎమ్మెల్యే, వన్ టైమ్ ఎంపీ మాత్ర‌మే.. కానీ మా అమ్మ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్ర‌జ‌ల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నార‌ని సుస్మిత వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement