త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anil Kumble | వ‌రుస‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ నెగ్గ‌డం స‌వాలే.. : అనిల్ కుంబ్లే

Anil Kumble | త్వ‌ర‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సంగ్రామం మొద‌లుకానున్న‌ది. కీల‌క టోర్నీకి టీమిండియా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ది. మెగా ఈవెంట్‌కు ముందు భార‌త స్నిన్ బౌల‌ర్లు వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, అక్షర్ పటేల్ అద్భుత ఫామ్‌లో కొన‌సాగుతున్న‌ది. దాంతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు స‌వాల్‌గా మారే అవ‌కాశం ఉన్న‌ది.

P

Sports | Published On Jan 27, 2026, 10.30 pm IST

Anil Kumble | వ‌రుస‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ నెగ్గ‌డం స‌వాలే.. : అనిల్ కుంబ్లే
Advertisement

Anil Kumble | త్వ‌ర‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సంగ్రామం మొద‌లుకానున్న‌ది. కీల‌క టోర్నీకి టీమిండియా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ది. మెగా ఈవెంట్‌కు ముందు భార‌త స్నిన్ బౌల‌ర్లు వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, అక్షర్ పటేల్ అద్భుత ఫామ్‌లో కొన‌సాగుతున్న‌ది. దాంతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు స‌వాల్‌గా మారే అవ‌కాశం ఉన్న‌ది. అయితే, టోర్నీలో మంచు కీల‌క‌పాత్ర పోషిస్తుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. అయితే, ఇది భార‌త స్పిన్న‌ర్ల‌కు పెద్ద ఇబ్బందేమీ కాద‌ని, దాన్ని ఎదుర్కొనే అనుభవం వారికి ఉందని టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో సాయంత్రం మ్యాచులు జరగడంతో మంచు ప్రభావం తప్పదని కుంబ్లే తెలిపాడు. ఇది సవాలే అయినా, మంచులోనూ బౌలింగ్ చేయడం స్పిన్నర్లకు కొత్త విషయం కాద‌ని జియోహాట్ స్టార్ కార్యక్రమంలో ఆయ‌న వ్యాఖ్యానించారు.

వరుణ్ చక్రవర్తి బౌలింగ్ శైలి కారణంగా అతడిపై మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. బంతిని పట్టుకునే విధానం, అతను వేసే వేగం వల్ల తడి బంతితో అతడు సులభంగా బౌలింగ్ చేయగలడన్నారు. అక్షర్ పటేల్‌కూ పెద్ద సమస్య ఉండదని చెప్పిన కుంబ్లే, కుల్దీప్ యాదవ్‌కు మాత్రం కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంద‌ని చెప్పాడు. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం కుల్దీప్‌కు కూడా అలవాటేనని వివరించాడు. మంచు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని జట్టు ఎంపిక చేయాల్సిన అవసరం లేదని కుంబ్లే స్పష్టం చేశాడు.

పరిస్థితుల గురించి అతిగా ఆలోచించకుండా అత్యుత్తమ జట్టునే ఆడించాల‌ని, ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగితే, బౌలింగ్ సమయంలో మంచు ఎక్కువగా ఉంటే కుల్దీప్ కంటే వరుణ్‌కు అవకాశం ద‌క్కొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. భారత్ టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలపై స్పందిస్తూ.. టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలవడం సవాలేనని కుంబ్లే తెలిపాడు. అయితే ప్రస్తుత జట్టు ఫామ్‌, బలాన్ని బట్టి చూస్తే భారత్ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని చెప్పాడు. భారత్ కచ్చితంగా సెమీఫైనల్స్‌కు చేరుకుంటుంద‌ని.. ఈసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement