త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sunil Narine | ఐపీఎల్‌లో సునీల్ న‌రైన స‌రికొత్త చ‌రిత్ర‌..! ఇషాన్ వికెట్‌తో ఘ‌న‌త‌..!

Sunil Narine | ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పాడు. ఈ లీగ్‌లో 200 వికెట్ల మైలురాయిని దాటిన మూడో బౌలర్‌గా, అలాగే ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చ‌రిత్ర సృష్టించాడు.

P

Sports | Published On May 3, 2026, 9.30 pm IST

Sunil Narine | ఐపీఎల్‌లో సునీల్ న‌రైన స‌రికొత్త చ‌రిత్ర‌..! ఇషాన్ వికెట్‌తో ఘ‌న‌త‌..!
Advertisement

Sunil Narine | ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పాడు. ఈ లీగ్‌లో 200 వికెట్ల మైలురాయిని దాటిన మూడో బౌలర్‌గా, అలాగే ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘ‌న‌త సాధించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసి నరైన్ కెరీర్‌లో 200వ వికెట్‌ను పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో నరైన్ 31 పరుగులకు 2 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను కుప్ప‌కూల్చారు.

కార్తీక్ త్యాగి రెండు వికెట్లు పడగొట్టగా, మిగతా బౌలర్లు కూడా తలో వికెట్ సాధించారు. ఫలితంగా సన్‌రైజర్స్ 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. 2012లో కేకేఆర్ జట్టుతో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన సునీల్ నరైన్, అప్పటి నుంచి అదే ఫ్రాంచైజీ త‌ర‌ఫున ఆడుతూ వ‌స్తున్నాడు. 2012, 2014, 2024 సీజన్లలో టైటిల్ గెలవడంలో న‌రైన్ కీలక పాత్ర పోషించాడు. వ్యక్తిగతంగా 2012లో పర్పుల్ క్యాప్, 2012, 2018లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులు అందుకున్నాడు. తాజా రికార్డుతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన స్పిన్నర్లలో ఒకడిగా సునీల్ నరైన్ తన స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకున్నాడు.

Advertisement
Advertisement