IPL 2026 | సన్‌రైజర్స్‌కు కేకేఆర్ బ్రేకులు.. ఏడు వికెట్ల తేడాతో పరాజయం..!
IPL 2026 | సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నిరాశ ఎదురైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 165 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 18.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL 2026 | సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నిరాశ ఎదురైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 165 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 18.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుత ఆరంభం ఇచ్చాడు. 28 బంతుల్లో 61 పరుగులు చేసిన అతను 9 ఫోర్లు, 3 సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. హెడ్ అవుట్ అయ్యాక ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ వేగం తగ్గింది. ఇషాన్ కిషన్ 42 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించగా, సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగింది. ఫిన్ అలెన్ వేగంగా ఆడగా.. అజింక్యా రహానే స్థిరంగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. యువ ఆటగాడు ఆంగ్‌క్రిష్ రఘువంశీ 59 పరుగులతో అద్భుత హాఫ్ సెంచరీ నమోదు చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు. చివర్లో రింకూ సింగ్ 22 నాటౌట్‌తో మెరుపులు మెరిపించడంతో కోల్‌కతా 10 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్, శివంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్ తలో వికెట్ పడగొట్టారు. ఇదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేయగా, సన్‌రైజర్స్ వరుస విజయాలకు బ్రేక్ పడినట్లయ్యింది. గత ఐదు మ్యాచ్‌ల తర్వాత ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






