Bigg Boss | ఇదేం ట్విస్ట్ – బిగ్‌బాస్‌కు మారిన హోస్ట్ – స్టార్ హీరో ప్లేస్‌లో శివగామి
బిగ్‌బాస్ సీజన్ 10 మధ్యలో ఉండగా హోస్ట్‌ను మార్చేశారు. స్టార్ హీరో ప్లేస్‌లో మరో కొత్త హోస్ట్ ఈ వారం బిగ్‌బాస్ లో సందడి చేయబోతుంది. ఆ హోస్ట్ ఎవరంటే?
Entertainment | Published On Oct 24, 2026, 7.42 pm IST
Bigg Boss | బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 10లో ఓ భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. షో మధ్యలో హోస్ట్‌ను మార్చేయబోతున్నారు. కొత్త ప్రోమో ద్వారా మేకర్స్ ఈ మార్పుపై హింట్ ఇచ్చేశారు. బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 10కు స్టార్ హీరో విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు. ఈ రియాలీటీ షోను అతడు నడిపిస్తోన్న తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. లెక్చర్స్, క్లాస్‌లు లేకుండా కంటెస్టెంట్స్ తప్పులను బయటపెట్టడం, హౌజ్‌లోని పరిస్థితులను బయటి రాజకీయాలకు ముడిపెడుతూ చేసిన కామెంట్లు చాలా సార్లు హాట్ టాపిక్‌గా మారాయి. షో అనే ఫీలింగ్ ఎక్కడ కలగనీయకుండా సహజంగా తన మనసులోని మాటలను విజయ్ సేతుపతి వ్యక్తీకరించే తీరుకు కంటెస్టెంట్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతోన్నారు.
విజయ్ సేతుపతి ప్లేస్
బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 10 ఆరు వారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాయి. ఏడో వారం ఫ్యాన్స్‌కు బిగ్‌బాస్ మేకర్స్ పెద్ద షాకిచ్చారు. విజయ్ సేతుపతి ప్లేస్‌లో కొత్త హోస్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ బిగ్‌బాస్ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఒక్క వారమే...
విజయ్ సేతుపతి సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో అతడి స్థానంలో ఈ శని, ఆది వారాల ఎపిసోడ్స్‌కు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. వచ్చే వారం తిరిగి విజయ్ సేతుపతి రీఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. గతంలో బిగ్‌బాస్ తెలుగు, తమిళ సీజన్స్‌కు గెస్ట్ హోస్ట్‌గా కనిపించిన అనుభవం రమ్యకృష్ణకు ఉంది. అందుకే ఆమెను సెలెక్ట్ చేసినట్లు సమాచారం.
జైలర్ 2...
రజనీకాంత్ జైలర్ 2లో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. తొమ్మిది రోజుల్లోనే ఆరు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Sethupathi | స్లమ్‌డాగ్‌కు గుమ్మడికాయ కొట్టిన పూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి లేకుండానే క్లైమాక్స్ షూట్
అక్టోబర్ 17, 2026

Faria Abdullah | కమల్‌హాసన్ డైరెక్టర్‌తో ఫరియా అబ్దుల్లా తెలుగు వెబ్‌సిరీస్ – టైటిల్ ఇదే
అక్టోబర్ 11, 2026

Sai Pallavi | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన సాయిపల్లవి – కానీ కండీషన్స్ అప్లై
అక్టోబర్ 8, 2026
తాజావార్తలు
- ●TGPCB | నానక్‌రామ్‌గూడ, కోకాపేటలో వాయు కాలుష్యం.. చర్యలకు దిగిన పీసీబీ
- ●TGPSC | అక్టోబర్ 26న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పరీక్ష.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- ●Telangana | కరువు.. అప్పులు.. సర్కారును కలవరపెడుతున్న కష్టాల సుడిగుండాలు
- ●Minister Seethakka | ఎల్ నినో ఎఫెక్ట్.. ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి కల్పించాలి
- ●KRMB | మహారాష్ట్రకు సీఎం రేవంత్.. 26న జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా
- ●Tilak and Nitish Speak in Telugu | నువ్వు కాల్ ఇవ్వలే.. రెండు అని చెప్పురా పోనీ.. తెలుగులో మాట్లాడి మ్యాచ్ గెలిపించిన తిలక్-నితిశ్

TGPCB | నానక్‌రామ్‌గూడ, కోకాపేటలో వాయు కాలుష్యం.. చర్యలకు దిగిన పీసీబీ

TGPSC | అక్టోబర్ 26న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పరీక్ష.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Telangana | కరువు.. అప్పులు.. సర్కారును కలవరపెడుతున్న కష్టాల సుడిగుండాలు

Minister Seethakka | ఎల్ నినో ఎఫెక్ట్.. ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి కల్పించాలి



