TGPCB | నానక్‌రామ్‌గూడ, కోకాపేటలో వాయు కాలుష్యం.. చర్యలకు దిగిన పీసీబీ
TGPCB | హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ (Nanakramguda), కోకాపేట (Kokapet) ప్రాంతాల్లో నిర్మాణ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యంపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) చర్యలకు పూనుకుంది.
- రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) ప్లాంట్లపై వేటుకు ఉత్తర్వులు జారీ
- రోలింగ్ టాస్క్‌ఫోర్స్ బృందాలతో పర్యవేక్షణ
TGPCB | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ (Nanakramguda), కోకాపేట (Kokapet) ప్రాంతాల్లో నిర్మాణ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యంపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TELANGANA POLLUTION CONTROL BOARD) చర్యలకు పూనుకుంది. నిర్మాణ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతున్నదని పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో నిర్మాణ ప్రాజెక్టుల్లో పర్యావరణ నిబంధనల అమలు, వాయు కాలుష్య నియంత్రణ చర్యల స్థితిగతులను పరిశీలించేందుకు రోలింగ్ టాస్క్ ఫోర్స్ (నిరంతర తనిఖీ) బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణను చేపట్టింది. రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) ప్లాంట్లపై వేటుకు ఉత్తర్వులు జారీ చేసింది.
టీజీపీసీబీ ప్రధాన కార్యాలయంలో నానక్‌రామ్‌గూడ, కోకాపేట ప్రాంతాల్లోని 19 నిర్మాణ ప్రాజెక్టుల పర్యావరణ నిబంధనల అమలు స్థితిగతులను శుక్రవారం టాస్క్‌ఫోర్స్ కమిటీ సమీక్షించింది. ఆయా ప్రాజెక్టుల తరఫున పలువురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తీవ్ర ఉల్లంఘనలకు పర్యావరణ పరిహారం, తక్కువ తీవ్రత కలిగిన ఉల్లంఘనలపై బ్యాంకు గ్యారంటీల జప్తుకు కమిటీ సిఫారసు చేసింది. నిబంధనల ఉల్లంఘనల సవరణకు 10 రోజుల గడువు విధించింది.
ప్రాజెక్టుల వారీగా నిబంధనల అమలుపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమగ్రంగా చర్చించిన తర్వాత, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన ప్రాజెక్టులపై పర్యావరణ పరిహారం విధించాలని, తక్కువ తీవ్రత ఉల్లంఘనలకు పాల్పడిన ప్రాజెక్టుల విషయంలో అవి సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను జప్తు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. కార్యకలాపాల నిర్వహణ అనుమతి ఉత్తర్వులు (Consent to Operate) పొందకుండా పనిచేస్తున్న రెండు నిర్మాణ ప్రాజెక్టులకు అనుబంధంగా పనిచేస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) ప్లాంట్లపై మూసివేత ఉత్తర్వులు జారీ చేయాలని కమిటీ సిఫారసు చేసింది.
నిబంధనలు పాటించని నిర్మాణ ప్రాజెక్టులు గుర్తించిన నిబంధనల ఉల్లంఘనలను సరిదిద్దుకునేందుకు 10 రోజుల్లోగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలనీ కమిటీ సిఫారసు చేసింది. కమిటీ సిఫారసుల మేరకు, సంబంధిత ప్రాజెక్టులపై పర్యావరణ పరిహారం విధించడం, బ్యాంకు గ్యారంటీలను జప్తు చేయడం, నిబంధనలను పాటించని ప్రాజెక్టులకు ఉల్లంఘనలను సరిదిద్దుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కార్యకలాపాల నిర్వహణ అనుమతి ఉత్తర్వులు (CTO) లేకుండా పనిచేస్తున్న రెండు అనుబంధ ఆర్ఎంసీ (RMC) ప్లాంట్లకు మూసివేత ఉత్తర్వులు జారీ చేయడం వంటి తదుపరి చర్యలను పీసీబీ చేపట్టనుంది.
సంబంధిత వార్తలు

TGPSC | అక్టోబర్ 26న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పరీక్ష.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
అక్టోబర్ 24, 2026

Telangana | కరువు.. అప్పులు.. సర్కారును కలవరపెడుతున్న కష్టాల సుడిగుండాలు
అక్టోబర్ 24, 2026

KRMB | మహారాష్ట్రకు సీఎం రేవంత్.. 26న జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా
అక్టోబర్ 24, 2026
తాజావార్తలు
- ●Telangana | కరువు.. అప్పులు.. సర్కారును కలవరపెడుతున్న కష్టాల సుడిగుండాలు
- ●Minister Seethakka | ఎల్ నినో ఎఫెక్ట్.. ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి కల్పించాలి
- ●KRMB | మహారాష్ట్రకు సీఎం రేవంత్.. 26న జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా
- ●Tilak and Nitish Speak in Telugu | నువ్వు కాల్ ఇవ్వలే.. రెండు అని చెప్పురా పోనీ.. తెలుగులో మాట్లాడి మ్యాచ్ గెలిపించిన తిలక్-నితిశ్
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్లో 774 మంది న్యాయవాదులుగా నమోదు
- ●Raashi Khanna | సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ సెట్స్‌లో రాఖీఖన్నా - ఫొటోలపై ఓ లుక్కేయండి!

Telangana | కరువు.. అప్పులు.. సర్కారును కలవరపెడుతున్న కష్టాల సుడిగుండాలు

Minister Seethakka | ఎల్ నినో ఎఫెక్ట్.. ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి కల్పించాలి

KRMB | మహారాష్ట్రకు సీఎం రేవంత్.. 26న జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా

Tilak and Nitish Speak in Telugu | నువ్వు కాల్ ఇవ్వలే.. రెండు అని చెప్పురా పోనీ.. తెలుగులో మాట్లాడి మ్యాచ్ గెలిపించిన తిలక్-నితిశ్



