త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Mallu Ravi | బీజేపీవి దృష్టి మ‌ళ్లింపు రాజ‌కీయాలు: ఎంపీ మ‌ల్లు ర‌వి

MP Mallu Ravi | త‌మ ప్ర‌భుత్వం మ‌రో 30 ఏళ్లు అధికారంలో ఉంటుంద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) మ‌ల్లు ర‌వి (MP Mallu Ravi) మండిప‌డ్డారు.

D

National | Published On Oct 23, 2026, 2.42 pm IST

MP Mallu Ravi | బీజేపీవి దృష్టి మ‌ళ్లింపు రాజ‌కీయాలు: ఎంపీ మ‌ల్లు ర‌వి
Advertisement

MP Mallu Ravi | త్రినేత్ర న్యూస్ : త‌మ ప్ర‌భుత్వం మ‌రో 30 ఏళ్లు అధికారంలో ఉంటుంద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) మ‌ల్లు ర‌వి (MP Mallu Ravi) మండిప‌డ్డారు. బీజేపీ దృష్టి మ‌ళ్లింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జ‌లు దీనిని గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు. రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోతుంద‌ని జోస్యం చెప్పారు. స‌ర్‌, శాంతిభ‌ద్ర‌త‌లు, నిరుద్యోగం వంటి అంశాల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని అన్నారు. పైపెచ్చు ప్ర‌జ‌ల‌ను బెదిరింపుల‌కు గురిచేస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు ఎన్నిక‌ల కోసం వేచిచూస్తున్నార‌ని పేర్కొన్నారు. బీజేపీ అంతానికి ఇది ఆరంభ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు అన్నీ అర్థం అయ్యాయ‌ని, బీజేపీని గ‌ద్దె దింపేందుకు ఎదురుచూస్తున్నార‌ని చెప్పారు.

అమిత్ షా ఏమ‌న్నారంటే..?

త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో షా పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. "బీజేపీ వరుసగా ఎన్నికల్లో గెలుస్తుండటంతో ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అందుకే కాంగ్రెస్ దాని మిత్ర‌ప‌క్షాలు బీజేపీపై ఓట్ చోరీ ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. రాహుల్ (Rahul Gandhi) జీ ఎప్పుడూ ఓట్ల దొంగ‌త‌నం గురించే మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆయ‌న చొర‌బాటుదారుల ఓట్ల‌ను కాపాడుకోవాల‌నుకుంటున్నారు కాబ‌ట్టి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందే బీజేపీ అనేక రాష్ట్రాల్లో గెలుస్తూ వస్తోంది. అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారానికి దూరంగానే ఉంది. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతే ఆ పార్టీ ఎన్నికల పరాజయాలు మొదలయ్యాయా..?" అని షా ఘాటుగా స్పందించారు. కేవ‌లం ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు చేయ‌డం వ‌ల్ల ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేర‌ని రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా విమర్శించారు. దేశంలో కాంగ్రెస్​ అనుసరిస్తున్న ప్రతికూల రాజకీయాల కారణంగా ఆ పార్టీ మ‌రో 30 ఏళ్ల వ‌ర‌కూ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ 30 ఏళ్ల పాటూ అధికారంలో ఉంటుందని ధీమా వ్య‌క్తం చేశారు.

Also Read..

విభజన శక్తులకు వ్య‌తిరేకంగా ఐక్యంగా పోరాడాలి.. ప్రధాని మోదీ పిలుపు

యూపీ ఓట‌ర్ల జాబితాలో విచిత్ర‌మైన పేర్లు.. తండ్రి పేరు స్థానంలో B.Com

అరుణాచల్ ప్రదేశ్ స‌రిహ‌ద్దు వెంబ‌డి చైనాతో ఘ‌ర్ష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి : ఐటీబీపీ చీఫ్

Advertisement
Advertisement