త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NASA | అత్యంత అరుదైన ఖ‌గోళ దృశ్యాన్ని బంధించిన నాసా హ‌బుల్ టెలిస్కోప్‌

NASA | అంతరిక్షంలో అరుదుగా కనిపించే అద్భుత దృశ్యాన్ని చూపిస్తూ ఒక అబ్బురపరిచే చిత్రం ఇప్పుడు శాస్త్రవేత్తలు, ఖగోళ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. శక్తివంతమైన ఒక నక్షత్రం, దాని చుట్టూ ప్రకాశిస్తూ కనిపిస్తున్న వాయు మేఘం కలిసి కనిపించే ఈ దృశ్యాన్ని నాసా/ఈఎస్ఏ హబుల్ స్పేస్ టెలిస్కోప్ చిత్రీకరించింది.

S

Science | Published On Feb 14, 2026, 7.25 am IST

NASA | అత్యంత అరుదైన ఖ‌గోళ దృశ్యాన్ని బంధించిన నాసా హ‌బుల్ టెలిస్కోప్‌
Advertisement

NASA | అంతరిక్షంలో అరుదుగా కనిపించే అద్భుత దృశ్యాన్ని చూపిస్తూ ఒక అబ్బురపరిచే చిత్రం ఇప్పుడు శాస్త్రవేత్తలు, ఖగోళ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. శక్తివంతమైన ఒక నక్షత్రం, దాని చుట్టూ ప్రకాశిస్తూ కనిపిస్తున్న వాయు మేఘం కలిసి కనిపించే ఈ దృశ్యాన్ని నాసా/ఈఎస్ఏ హబుల్ స్పేస్ టెలిస్కోప్ చిత్రీకరించింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న నక్షత్రం హెన్ 2-427, దీనిని WR 124 అని కూడా పిలుస్తారు. దానిని చుట్టుముట్టి ఉన్న నెబ్యులా పేరు M1-67. ఈ ఖగోళ వస్తువులు ధనుస్సు (సజిటేరియస్) నక్షత్ర మండలంలో ఉండగా, భూమి నుంచి సుమారు 15,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు నాసా వెల్లడించింది.

చిత్రం మధ్యభాగంలో హెన్ 2-427 నక్షత్రం అత్యంత ప్రకాశవంతంగా మెరిసిపోతూ కనిపిస్తోంది. దాని చుట్టూ ఉన్న వేడి క‌లిగిన వాయు ముద్దలు అతి వేగంగా అంతరిక్షంలోకి విసర్జించబడుతున్నాయి. ఈ వాయువులు గంటకు 93,210 మైళ్లకు, అంటే సుమారు 1,50,000 కిలోమీటర్ల వేగంతో బయటకు దూసుకువెళ్తున్నాయి. ఈ ప్రక్రియ అంతరిక్షంలో అత్యంత శక్తివంతమైన, చూడముచ్చటైన దృశ్యాన్ని సృష్టిస్తోంది.

హెన్ 2-427 ఎలాంటి నక్షత్రం ?

హెన్ 2-427 ఒక వుల్ఫ్-రాయెట్ (Wolf-Rayet) తరగతికి చెందిన నక్షత్రంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తరహా నక్షత్రాలకు ఖగోళ శాస్త్రవేత్తలు చార్లెస్ వుల్ఫ్, జార్జెస్ రాయెట్ పేర్లను పెట్టారు. వుల్ఫ్-రాయెట్ నక్షత్రాలు అత్యంత వేడిగా ఉండటమే కాకుండా, భారీ పరిమాణంలో పదార్థాన్ని నిరంతరం అంతరిక్షంలోకి విసర్జిస్తుంటాయి. హెన్ 2-427ను చుట్టుముట్టి ఉన్న M1-67 నెబ్యులా వయస్సు సుమారు 10వేల‌ సంవత్సరాలకే పరిమితమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఖగోళ శాస్త్ర పరంగా చూస్తే ఇది చాలా చిన్న వయస్సేనని చెప్పాలి. అయినప్పటికీ ఈ నెబ్యులా తన మధ్యలో ఉన్న శక్తివంతమైన నక్షత్రం చుట్టూ ప్రకాశిస్తూ అత్యంత ఆకర్షణీయమైన, అందమైన దృశ్యాన్ని అందిస్తోందని నాసా పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement