NASA | అంతరిక్షానికి ఐఫోన్.. నాసా గ్రీన్ సిగ్నల్..
NASA | అమెరికాకు చెందిన నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తమ వెంట ఏకంగా ఐఫోన్లను తీసుకెళ్లవచ్చని తెలియజేసింది. వ్యోమగాములు తమ వెంట ఐఫోన్లను తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
NASA | అమెరికాకు చెందిన నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తమ వెంట ఏకంగా ఐఫోన్లను తీసుకెళ్లవచ్చని తెలియజేసింది. వ్యోమగాములు తమ వెంట ఐఫోన్లను తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ ఈ విషయాన్ని తెలియజేశారు. త్వరలో అంతరిక్షంలో చంద్రుని వద్దకు ప్రయాణించనున్న ఆర్టెమిస్-2 మిషన్‌లో పాల్గొననున్న వ్యోమగాములు స్మార్ట్ ఫోన్లను తీసుకెళ్లవచ్చని తెలిపారు. అయితే స్మార్ట్ ఫోన్లు అంటే ఐఫోన్‌లకు మాత్రమే ప్రస్తుతానికి అనుమతి ఉందని చెప్పారు. కానీ ఏయే ఐఫోన్ మోడల్స్‌ను తీసుకెళ్లవచ్చు.. అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఐఫోన్ల దీర్ఘకాలిక వినియోగానికి ఓకే..
నాసా తీసుకున్న ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మక ఘట్టంగా సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. వ్యక్తిగత టెక్నాలజీ విషయంలో నాసా సంప్రదాయంగా వ్యవహరిస్తుంది. కానీ ఇకపై పాటించబోయే ధోరణి మాత్రం అత్యంత జాగ్రత్తతో కూడిన కీలక మలుపు అని వారు పేర్కొంటున్నారు. అయితే దీనిపై టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ కూడా స్పందించింది. ఐఫోన్లను అంతరిక్షంలో దీర్ఘకాల వినియోగానికి అధికారికంగా అనుమతించడం ఇదే తొలిసారి అని తెలిపింది. ఇప్పటి వరకు అంతరిక్షంలో వ్యోమగాములు కేవలం కొన్ని అనుమతించిన కెమెరాలను మాత్రమే ఉపయోగించేవారు. కానీ నాసా తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో వ్యోమగాములు ఇకపై తమ అనుభవాలను తమ కుటుంబ సభ్యులు, ప్రజలతో నేరుగా పంచుకునే వీలు కలగనుందని అంటున్నారు.
దృశ్యాలను వెంటనే రికార్డు చేసే సదుపాయం..
ఈ విషయంపై జారెడ్ ఐజాక్‌మన్ మాట్లాడుతూ అంతరిక్షంలో ఐఫోన్లను వినియోగించడం కేవలం సౌలభ్యం కోసమే కాదని, రోజువారి జీవితంలో భాగం అయిన సులభమైన, శక్తివంతమైన సాధనాలను వ్యోమగాములకు అందించడమే లక్ష్యమని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. వ్యోమగాములు అంతరిక్షంలో తాము అనుభవించే కీలక క్షణాలను చిత్రీకరించేందుకు ఫోన్లు మరింత వెసులు బాటు కల్పిస్తాయని, భూమిపై ఉన్నవారితో ఫొటోలు, వీడియోలను పంచుకునేందుకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. అంతరిక్షం నుంచి అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయని, స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆ దృశ్యాలను వెంటనే రికార్డు చేసేందుకు ఎంతో వీలుగా, సులభంగా ఉంటుందని అన్నారు.
ఐఫోన్ 4 మోడల్స్, పరిమితంగానే వినియోగం..
స్మార్ట్ ఫోన్లను అంతరిక్షంలో అనుమతించడం ద్వారా పాత విధానాలను మరోసారి పరిశీలిస్తామని ఐజాక్‌మన్ తెలిపారు. ఆధునిక హార్డ్ వేర్‌కు ఫ్లైట్ అప్రూవల్స్ ను వేగవంతం చేసే దిశగా నాసా పాత రూల్స్‌ను మరోసారి సమీక్షిస్తుందని అన్నారు. అంతరిక్షంలో ఏ పరికరం అయినా సరే రేడియేషన్, తీవ్ర ఉష్ణోగ్రత, శూన్యం వంటి కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అయినప్పటికీ కఠినంగా అమలు చేస్తే విజయం సాధించవచ్చని తెలిపారు. కాగా గతంలో నిర్వహించిన ఆర్టెమిస్ మిషన్ల కోసం నికాన్ డీఎస్ఎల్ఆర్, గో ప్రో వంటి బ్రాండ్లకు చెందిన కెమెరాలను ఉపయెగించారు. కానీ ఇప్పుడు ఐఫోన్లను ఉపయోగించబోతుండడం చరిత్రాత్మక పరిణామంగా భావిస్తున్నారు. 2011లో చివరి స్పేస్ షటిల్ మిషన్ లో ఐఫోన్ 4 మోడల్స్‌ను పరిమితంగా ఉపయోగించారు. కానీ ఇప్పుడు మాత్రం దీర్ఘకాలిక వినియోగానికి ఐఫోన్లకు నాసా ఓకే చెప్పింది. ప్రైవేటు మిషన్లలో స్మార్ట్ ఫోన్ల వినియోగానికి ఇప్పటికే అనుమతి లభించినా నాసా తొలిసారి ఈ విషయానికి ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో చేపట్టబోయే అన్ని మిషన్లలోనూ వ్యోమగాములు ఐఫోన్లతో తీయబోయే ఫొటోలు లేదా వీడియోలను ప్రజలు వీక్షించబోతున్నారని సైంటిస్టులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Samsung | రీఫర్బిష్డ్ ఫోన్లను స్వయంగా విక్రయిస్తున్న శాంసంగ్.. వినూత్న ప్రోగ్రామ్ ప్రారంభం..
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



