Black Hole | రాకాసి కృష్ణబిలం.. సూరుడి కంటే 36 కోట్ల రెట్లు భారీగా..!
Black Hole | అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ముందడుగు పడింది. విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన అత్యంత సుదూర క్వాసార్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. బిగ్‌బ్యాంగ్ (మహా విస్ఫోటనం) జరిగిన కేవలం 63 కోట్ల ఏళ్లకే ఇది ఉనికిలోకి వచ్చినట్లు గుర్తించారు. దీని కేంద్రంలోని కృష్ణబిలం (బ్లాక్‌హోల్) మన సూర్యుడి కంటే ఏకంగా 36 కోట్ల రెట్లు భారీగా ఉండటం విశేషం.
Black Hole | అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ముందడుగు పడింది. విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన అత్యంత సుదూర క్వాసార్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. బిగ్‌బ్యాంగ్ (మహా విస్ఫోటనం) జరిగిన కేవలం 63 కోట్ల ఏళ్లకే ఇది ఉనికిలోకి వచ్చినట్లు గుర్తించారు. దీని కేంద్రంలోని కృష్ణబిలం (బ్లాక్‌హోల్) మన సూర్యుడి కంటే ఏకంగా 36 కోట్ల రెట్లు భారీగా ఉండటం విశేషం. విశ్వం ఆవిర్భావం జరిగిన తొలి దశలోనే ఇంత భారీ కృష్ణబిలం ఎలా ఏర్పడిందన్నది ఇప్పుడు శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
క్వాసార్ అంటే ?
క్వాసార్ అనేది గెలాక్సీ కేంద్రంలోని అత్యంత ప్రకాశవంతమైన ప్రాంతం. దీని మధ్యలో భారీ కృష్ణబిలం ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాయువులు, ధూళి తదితర పదార్థాలను కృష్ణబిలం తనవైపు ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో భారీగా శక్తి, కాంతి విడుదలవుతాయి. దీంతో క్వాసార్లు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వీటి అధ్యయనం ద్వారా విశ్వం తొలి దశలోని పరిస్థితులు, అప్పట్లో ఏర్పడిన భారీ కృష్ణబిలాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్త జూలియన్ వోల్ఫ్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేపట్టింది. 2023లో ప్రయోగించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన యూక్లిడ్ టెలిస్కోప్ సేకరించిన లక్షలాది పరిశీలనలను విశ్లేషించి ఈ క్వాసార్‌ను గుర్తించింది. ఐర్లాండ్‌లోని అరన్ దీవుల్లో ఉన్న పురాతన రాతి కోట డన్ ఏంగస్ పేరును దీనికి పెట్టారు.
సూరుడి కంటే 36 కోట్ల రెట్లు భారీగా..
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పరిశీలనల ప్రకారం.. ఈ క్వాసార్ కేంద్రంలోని కృష్ణబిలం ద్రవ్యరాశి సూర్యుడి కంటే సుమారు 36 కోట్ల రెట్లు ఎక్కువ. ఇంతటి భారీ కృష్ణబిలం విశ్వం ఏర్పడిన తొలి దశలోనే ఉండటం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తోంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఇంత భారీ పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ కృష్ణబిలం చుట్టుపక్కల పదార్థాలను తక్కువ వేగంతోనే తనలోకి లాగుతోంది. ఈ అసాధారణ తీరుపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
రికార్డును త్వరలోనే అధిగమిస్తారా?
హబుల్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌లతో పాటు భూమిపై, అంతరిక్షంలో ఉన్న ఇతర అబ్జర్వేటరీలు కూడా ఈ ఆవిష్కరణను ధ్రువీకరించాయి. గతంలో గుర్తించిన క్వాసార్లతో పోలిస్తే విశ్వ చరిత్రలో మరింత తొలినాళ్లకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లభించింది. ఈ పరిశోధన తుది ఫలితాలు ‘ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ రికార్డు ఎన్నాళ్లు కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరికొన్ని నెలల్లోనే దీన్ని అధిగమించే క్వాసార్లు బయటపడే అవకాశం ఉందని జూలియన్ వోల్ఫ్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఈ రికార్డు ఏళ్ల తరబడి కొనసాగవచ్చని పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలో కృష్ణబిలం ఇంత భారీ పరిమాణానికి ఎలా చేరిందన్న ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు మరిన్ని క్వాసార్ల కోసం అన్వేషిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Chupudu Velu Book Launch | వివక్ష లేని సమాజం కోసం కాశన్న కలం కదిలింది
- ●Shruti Haasan | మూడేళ్ల తర్వాత హీరోయిన్గా శృతిహాసన్‌కు ఛాన్స్
- ●Hyderabad School Picnic Tragedy | స్కూల్ పిక్నిక్లో విషాదం : భారీ ఇనుప ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి
- ●Attender Manideep Kumar Funerals | అటెండర్ మణిదీప్ పాడె మోసి.. చెల్లెలి చదువు, పెళ్లిపై హామీ ఇచ్చి
- ●Sampath Nandi | సెన్సార్ అడ్డంకులకు కారణమదే - ఐటెంసాంగ్స్ ఉండవు - "భోగి"పై సంపత్ నంది కామెంట్స్
- ●Rising Stars Asia Cup | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 53 బంతుల్లో 204 పరుగులు..!

Chupudu Velu Book Launch | వివక్ష లేని సమాజం కోసం కాశన్న కలం కదిలింది

Shruti Haasan | మూడేళ్ల తర్వాత హీరోయిన్గా శృతిహాసన్‌కు ఛాన్స్

Hyderabad School Picnic Tragedy | స్కూల్ పిక్నిక్లో విషాదం : భారీ ఇనుప ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి

Attender Manideep Kumar Funerals | అటెండర్ మణిదీప్ పాడె మోసి.. చెల్లెలి చదువు, పెళ్లిపై హామీ ఇచ్చి






