ISRO | రాస్‌కాస్మోస్‌తో ఇస్రో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ఒప్పందం ముందడుగు..!
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రష్యాకు చెందిన రాస్‌కాస్మోస్‌తో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ సరఫరాపై మాస్కోలో మాస్కో వేదికగా చర్చలు జరిపింది. ఇస్రో వార్షిక నివేదిక ప్రకారం ఇందుకు సంబంధించిన ముసాయిదా ఒప్పందం సిద్ధమైంది. ప్రభుత్వ ఆమోద ముద్ర దశలో ఉంది.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రష్యాకు చెందిన రాస్‌కాస్మోస్‌తో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ సరఫరాపై మాస్కోలో మాస్కో వేదికగా చర్చలు జరిపింది. ఇస్రో వార్షిక నివేదిక ప్రకారం ఇందుకు సంబంధించిన ముసాయిదా ఒప్పందం సిద్ధమైంది. ప్రభుత్వ ఆమోద ముద్ర దశలో ఉంది. ఈ ఒప్పందంతో భవిష్యత్‌లో భారీ లాంచ్ వెహికిల్స్ అభివృద్ధికి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ సాంకేతికంగా కీలకంగా భావిస్తున్నారు. కిరోసిన్, లిక్విడ్ ఆక్సిజన్ మిశ్రమంతో పనిచేసే ఈ ఇంజిన్ హై థ్రస్ట్, మెరుగైన సామర్థ్యాన్ని అందిస్తుంది. దాంతో భారీ ఉపగ్రహాలను సైతం అంతరక్షింలోకి పంపడంతో పాటు డీప్ స్పేస్ మిషన్లు చేపట్టేందుకు సైతం అవకాశం ఉంటుంది.
ఇస్రో ఇప్పటికే స్వదేశీ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధిపై పని చేస్తోంది. అయితే, రాస్‌కాస్మోస్‌తో భాగస్వామ్యం ఈ సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు క్లిష్టమైన సాంకేతిక సవాళ్లను అధిగమించడంలో కీలకపాత్ర పోషించనుంది. అయితే, ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించకపోయినా చర్చలు ముందడుగు దశలోనే ఉన్నట్లుగా సంకేతాలిచ్చింది. ఇస్రో గతేడాది మార్చి 28న తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో సెమీ-క్రయోజెనిక్ ఇంజిన్ (SE2000) పవర్ హెడ్ టెస్ట్ ఆర్టికల్‌పై హాట్ టెస్ట్‌ని విజయవంతంగా నిర్వహించింది. 2వేల కిలోన్యూటన్ థ్రస్ట్ సామర్థ్యం కలిగిన ఈ ఇంజిన్, ఎల్‌వీఎం3 రాకెట్‌లోని సెమీ క్రయోజనిక్ బూస్టర్ స్టేజికి శక్తినందిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎల్110 దశను ఇది భర్తీ చేయడం ద్వారా పెలోడ్ సామర్థ్యం 4 టన్నుల నుంచి 5 టన్నులకు పెరగనుంది.
రష్యా స్పేస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ ప్రతిపాదించిన వీనస్ ఆర్బిటర్ మిషన్‌లో పెలోడ్ భాగస్వామిగా కొనసాగుతుంది. ఈ మిషన్ ద్వారా శుక్రగ్రహం వాతావరణం, ఉపరితలం, సౌర ప్రభావాలపై అధ్యయనం చేయాలని లక్ష్యం. అంతేకాకుండా మానవ అంతరిక్ష ప్రయాణం, శాటిలైట్ నావిగేషన్, భూమి పరిశీలన రంగాల్లో ఇతర దేశాల సహకారంతో ఇస్రో ముందుకు సాగుతోంది.
సంబంధిత వార్తలు

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



