Powerful Microwave | రెండు గెలాక్సీల ఢీ..! విశ్వంలో పవర్‌ఫుల్ శక్తిపుంజం..!
Powerful Microwave | విశ్వంలో ఇప్పటి వరకు గుర్తించిన వాటికంటే అత్యంత పవర్‌ఫుల్ మైక్రోవేవ్ లేజర్‌ను గుర్తించినట్లుగా శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది. రెండు గెలాక్సీలు ఢీకొనడం వల్ల ఈ అసాధారణ శక్తి పుంజం ఏర్పడిందని వెల్లడించారు.
Powerful Microwave | విశ్వంలో ఇప్పటి వరకు గుర్తించిన వాటికంటే అత్యంత పవర్‌ఫుల్ మైక్రోవేవ్ లేజర్‌ను గుర్తించినట్లుగా శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది. రెండు గెలాక్సీలు ఢీకొనడం వల్ల ఈ అసాధారణ శక్తి పుంజం ఏర్పడిందని వెల్లడించారు. శాస్త్రీయంగా దీన్ని “మేసర్” (Maser)గా వ్యవహరిస్తారు. ఇది లేజర్‌లానే అత్యంత కచ్చితమైన, కేంద్రీకృత శక్తి కిరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే, లేజర్ కనిపించే కాంతిని విడుదల చేస్తే, మేసర్ మాత్రం మైక్రోవేవ్ తరంగాలను విడుదల చేస్తుంది. పరిశోధకుల ప్రకారం.. ఇప్పటివరకు గుర్తించిన మేసర్‌లలో ఇదే అత్యంత ప్రకాశవంతమైనదిగా, అత్యంత దూరంలో ఉండడం విశేషం. ఈ అధ్యయనం ‘నేచర్ ఆస్ట్రానమీ’ జర్నల్‌లో ప్రచురితమైంది.
లేజర్ ఎలా ఏర్పడుతుంది?
లేజర్, మేజర్‌ను తయారు చేసే ప్రక్రియ ప్రాథమికంగా ఒకే విధంగా ఉంటుంది. మొదట పరమాణువులను అస్థిరమైన, అధిక-శక్తి స్థితికి తీసుకువస్తారు. ఆ తర్వాత, ఫోటాన్‌లు అని పిలువబడే కాంతి కణాలు ఈ ఉత్తేజిత పరమాణువులతో ఢీకొన్నప్పుడు, అవి తమ శక్తిని విడుదల చేసి కొత్త ఫోటాన్‌లను వెలువరిస్తాయి. దీంతో ప్రతిచర్య ఏర్పడి ఫోటాన్‌ల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ప్రతి అణువు ఒకే తరంగదైర్ఘ్యంతో ఫోటాన్‌ను విడుదల చేయడం వల్ల మొత్తం కిరణం ఒకే ఫ్రీక్వెన్సీతో, అత్యంత కేంద్రీకృతంగా ఉంటుంది. ఇదే లేజర్ లక్షణం కాగా, మేసర్‌లో ఇది మైక్రోవేవ్ రూపంలో కనిపిస్తుంది.
దూర గెలాక్సీలను, వాటి కేంద్రాల్లో జరుగుతున్న అత్యంత తీవ్ర పరిణామాలను అధ్యయనం చేయడానికి ఇలాంటి మేసర్‌లు ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. గెలాక్సీలు ఎలా అభివృద్ధి చెందుతాయి ? ఢీకొనేటప్పుడు వాటిలో ఏ భౌతిక ప్రక్రియలు జరుగుతాయి? ప్రారంభ విశ్వంలో శక్తి ఎలా పంపిణీ అయింది వంటి అంశాలను అవి స్పష్టంగా తెలియజేస్తాయి. బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో జరిగిన గెలాక్సీల ఢీకొనడం వల్ల ఉత్పత్తి అయిన ఈ శక్తి భూమిపై కూడా గుర్తించగలగడం ఖగోళ భౌతిక శాస్త్రంలో ఒక కీలక విజయంగా భావిస్తున్నారు.
ఇది కేవలం ఒక ఖగోళ సంఘటన రికార్డు మాత్రమే కాకుండా, విశ్వ ఆరంభ చరిత్రను అర్థం చేసుకోవడానికి కొత్త దారులు తెరుస్తోందని శాస్త్రవేత్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి శక్తివంతమైన, దూర మేసర్‌ల ద్వారా గెలాక్సీల ఢీకొన సమయంలో వాయు, ధూళి ఎలా కేంద్రీకృతమవుతాయి..? అతిపెద్ద బ్లాక్ హోల్స్ చుట్టూ శక్తి ఎలా సమీకృతమవుతుంది ? నక్షత్రాల ఏర్పాటులో తీవ్రత ఎంతవరకు ఉంటుందనే విషయాలను శాస్త్రవేత్తలు విశ్లేషించవచ్చని పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



