Hakimpet Education Hub | హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌పై సీఎం రేవంత్ సీరియస్: అధికారులకు వార్నింగ్, ప్రతీ నెలా సైట్‌లోనే బస!
వికారాబాద్ జిల్లా హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో జాప్యంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డెడ్ లైన్ విధించారు.
Rangareddy | Published On Jul 21, 2026, 9.17 pm IST
- వికారాబాద్ జిల్లా హకీంపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
- నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం పట్ల అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం
- ఇకపై ప్రతీ నెలా పనుల పురోగతిని రివ్యూ చేయడంతో పాటు, సైట్‌లోనే ఒకరోజు బస చేస్తానని ప్రకటన
- నిర్లక్ష్యం వహించే అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు
- భూములు కోల్పోయిన రైతులకు వారంలోగా ప్లాట్ల పంపిణీకి డెడ్ లైన్
Hakimpet Education Hub | త్రినేత్ర.న్యూస్ : వికారాబాద్ జిల్లా హకీంపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఎడ్యుకేషన్ హబ్' (Education Hub) పనుల్లో జాప్యంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్వయంగా ప్రాజెక్ట్ సైట్‌ను సందర్శించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
ఇందులో భాగంగా ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ కాలేజీలతో పాటు ఫిజియోథెరపీ, పారా మెడికల్ (Para medical) కాలేజీలు, సంబంధిత హాస్టళ్ల నిర్మాణాల స్టేటస్‌పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నత్తనడకన సాగుతుండటంపై అధికారులపై సీఎం మండిపడ్డారు. ప్రాజెక్టు పనులను వెంటనే స్పీడప్ చేయాలని ఆదేశించారు.
నెలవారీ రివ్యూ.. సైట్‌లోనే బస
ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఎడ్యుకేషన్ హబ్‌లో ప్రతీ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం స్పష్టం చేశారు. ఇకపై ప్రతీ నెలా పనుల ప్రోగ్రెస్ రివ్యూ చేయడమే కాకుండా, స్వయంగా ఒకరోజు సైట్‌లోనే బస చేసి పనులను పర్యవేక్షిస్తానని సంచలన ప్రకటన చేశారు.
పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించేది లేదని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వెంటనే వారిని సస్పెండ్ చేయడానికి వెనుకాడొద్దని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
రైతులకు వారం రోజుల్లో ప్లాట్లు
ఎడ్యుకేషన్ హబ్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన లబ్ధిదారులకు వచ్చే వారం రోజుల్లోగా ప్లాట్ల పట్టాలను అందజేయాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు. అనంతరం స్థానిక అధికారులతో కలిసి ప్రాజెక్ట్ అభివృద్ధి ప్రణాళికలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు






