TTD | నవ వధూవరులకు శ్రీవారి అక్షింతలు.. పోస్టు ద్వారా ఇలా పొందవచ్చు..
TTD | తిరుమల: వివాహం చేసుకోబోయే వధూవరులకు శ్రీవారి దీవెనలతో అక్షింతలు, కుంకుమ, కంకణం, శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీపద్మావతీ అమ్మవారి ఫోటోలతో కూడిన ఆశీర్వచనం పత్రిక, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని టీటీడీ అందిస్తుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Popular news | Published On Dec 23, 2025, 3.38 pm IST
TTD | తిరుమల: వివాహం చేసుకోబోయే వధూవరులకు శ్రీవారి దీవెనలతో అక్షింతలు, కుంకుమ, కంకణం, శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీపద్మావతీ అమ్మవారి ఫోటోలతో కూడిన ఆశీర్వచనం పత్రిక, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని టీటీడీ అందిస్తుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది శుభలేఖ పంపిన లక్ష మందికి పైగా వధూవరులకు శ్రీవారి దీవెనలతో కల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతన వధూవరులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని, ఇంతటి విశిష్టమైన వివాహానికి కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరుడి ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముందని అన్నారు. ఈ మహత్తర అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తోందని తెలిపారు. ఇందుకు గాను వధూవరులు పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపాల్సి ఉంటుందన్నారు.
నవసమాజంలో గృహస్థ ధర్మం కీలకమైనదని అన్నారు. వధూవరుల కల్యాణంలో మొదటి ఘట్టంగా కంకణధారణ చేస్తారని, ఉపద్రవాల నుండి రక్షించే రక్షాబంధనమైన కంకణాలను వరుడి కుడిచేతికి, వధువు ఎడమ చేతికి ధరింపచేస్తారని తెలిపారు. ఇందుకోసం శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు కోరుతూ కుంకుమ, కంకణధారణకు కంకణం పంపుతున్నట్లు వివరించారు. వివాహంలో భాగంగా చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉంటుందని, నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని, సత్కర్మలు పెంపొందాలని, దాంపత్యం ఫలప్రదం కావాలని, భార్యాభర్తలు పరస్పరం ప్రీతిపాత్రులు కావాలని, సిరిసంపదలు కలగాలని టీటీడీ కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతోందని అన్నారు.
నూతన వధూవరులకు వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు కల్యాణ సంస్కృతి పేరిట ఓ పుస్తకాన్ని, శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ పద్మావతీ అమ్మవార్ల ఫొటోలతో కూడిన వేద ఆశీర్వచన పత్రికను టీటీడీ కార్యనిర్వహణాధికారి పేరిట పంపుతారని అన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని శుద్ధ ప్రతి విభాగం (తపాలా విభాగం) సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా నూతన జంటలకు శ్రీవారి అశీస్సులు అందిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే ఆసక్తి ఉన్నవారు శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు గాను తమ వివాహ శుభలేఖను పూర్తి చిరునామాతో పంపించాల్సి ఉంటుందని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులు పొందాలనుకునే నూతన వధూవరులు తమ పూర్తి చిరునామాతో కార్యనిర్వహణాధికారి, టీటీడీ పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి - 517501 పేరిట వివాహ పత్రికను పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు కాల్ సెంటర్ నంబర్ 155257 లో సంప్రదించవచ్చని తెలిపారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






