TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆగస్టు నెల దర్శన టికెట్ల షెడ్యూల్ ఇదే
Devotional | Published On May 9, 2026, 6.37 pm IST
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అలెర్ట్ జారీ చేసింది. ఆగస్టు నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్‌ను వెల్లడించింది. వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, గదుల కోటాకు సంబంధించిన తేదీలు, సమయాలను ప్రకటించింది. ఆర్జిత సేవా టికెట్లయిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న భక్తులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మే 18న ఉదయం 10 గంటలకు లక్కీ డీప్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. మే 20 ఉదయం 10 గంటల వరకు భక్తులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. 20న మధ్యాహ్నం 12 గంటలకు ర్యాండమైజ్ ఆన్‌లైన్ విధానంలోనే లాటరీ తీస్తారు. టికెట్లు వచ్చిన భక్తులు 22న మధ్యాహ్నంలోగా డబ్బులు కడితే టికెట్లు పంపిస్తారు.
21న కీలక సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను మే 21 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజున 2026 ఆగస్టు 23 నుంచి 25 వరకు జరిగే వార్షిక పవిత్రోత్సవాలకు సంబంధించిన టికెట్లు సైతం అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
23న శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు..
ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల కానుండగా, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. అలాగే, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మే 25 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కేటాయింపు కోటా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వివరించింది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.inలో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tirumala | శ్రీనివాసుడి భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు రద్దు, ఆర్జిత సేవలు కూడా..
జులై 5, 2026

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



