Govindaraja Swamy Brahmotsavam | తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? తిరుపతిలో జరిగే ఉత్సవాలకు సైతం వెళ్లిరండి..!
Govindaraja Swamy Brahmotsavam | తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోవాలకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 31 వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 22న సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
Devotional | Published On May 12, 2026, 9.11 am IST
Govindaraja Swamy Brahmotsavam | తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోవాలకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 31 వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 22న సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో ప్రతిరోజూ గోవిందరాజస్వామి ఉదయం, రాత్రి వాహన సేవల్లో ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి రోజూ భక్తి సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్, హిందూ ధర్మప్రచార పరిషత్ బృందాలు కార్యక్రమాల్లో పాల్గొననున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం జరగనుంది. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు. ఆలయ ప్రాంగణం, గర్భగుడి, గోడలు, పైకప్పు సహా అన్ని భాగాలను పవిత్ర జలాలతో శుద్ధి చేసి, నామకోపు, గంధం, కుంకుమ, పసుపు, కర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఆలయంలో ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
వాహన సేవల షెడ్యూల్ ఇలా..
మే 23: ధ్వజారోహణం అనంతరం రాత్రి పెద్దశేష వాహన సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
మే 24: ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం.
మే 25: ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి సేవ.
మే 26: ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం.
మే 27: ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహన సేవ
మే 28: ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం.
మే 29: ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం.
మే 30: ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం.
మే 31: ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






