Reel | తుపాకీతో యువకుడి రీల్.. గుండెల్లో తూటా పేలి మృతి
Social media | సోషల్ మీడియాపై జనానికున్న మోజు ఎలాంటిదో కొత్తగా చెప్పనక్కర్లేదేమో. రీల్స్ చేస్తూ వ్యూస్ కోసం ప్రాణాలను లెక్క చేయడం లేదు. ఇందుకు తాజాగా దిల్లీ (Delhi) లో జరిగిన ఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు. తుపాకీ(Pistol) తో రీల్ (Reel) చేయబోయిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
త్రినేత్ర.న్యూస్: సోషల్ మీడియాపై జనానికున్న మోజు ఎలాంటిదో కొత్తగా చెప్పనక్కర్లేదేమో. రీల్స్ చేస్తూ వ్యూస్ కోసం ప్రాణాలను లెక్క చేయడం లేదు. ఇందుకు తాజాగా దిల్లీ (Delhi) లో జరిగిన ఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు. తుపాకీ(Pistol) తో రీల్ (Reel) చేయబోయిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. లోడ్ చేసిన గన్‌తో రీల్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలి ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. మృతుడిని తూర్పు దిల్లీకి చెందిన పవన్ (Pawan)గా పోలీసులు గుర్తించారు.
ఎలా జరిగిందంటే..
పవన్ గన్‌తో రీల్ చేస్తుండగా తన స్నేహితుడు దాన్ని చరవాణిలో రికార్డ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా తుపాకీని లోడ్ చేశాడు. ఆ తర్వాత గన్‌ను ఛాతీపై పెట్టుకొని కెమెరా వైపు చూస్తూ నవ్వాడు. తన స్నేహితుడు కాల్చొద్దని చెప్పేలోపే పవన్ కంగారులో ట్రిగ్గర్ నొక్కేశాడు. దీంతో బుల్లెట్ నేరుగా గుండెల్లోకి దూసుకెళ్లింది. ఘటనా స్థలంలోనే పవన్ కుప్పకూలిపోగా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. లైసెన్స్ కలిగి ఉన్న ఈ తుపాకీని వీడియో రికార్డు చేసిన పవన్ స్నేహితుడిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






