Alleti Maheshwar Reddy | కాళేశ్వరం అవినీతిపై సీబీఐకి లెటర్ రాయండి.. మేం విచారణ జరిపిస్తం: శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Alleti Maheshwar Reddy | కాళేశ్వరం(Kaaleshwaram) లో లక్ష కోట్ల అవినీతి (Curruption) జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, దీనిపై సీబీఐ(CBI) కి స్పష్టంగా లెటర్ రాస్తే తాము విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతిపై విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు.
త్రినేత్ర.న్యూస్: కాళేశ్వరం(Kaaleshwaram) లో లక్ష కోట్ల అవినీతి (Curruption) జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, దీనిపై సీబీఐ(CBI) కి స్పష్టంగా లెటర్ రాస్తే తాము విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతిపై విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడారు. తప్పు చేసిన వారిని జైలుకు పంపే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.
లక్ష కోట్ల కాళేశ్వరం కుంభకోణంపై వేశామంటున్న కమిషన్ల విచారణలో ఎలాంటి పారదర్శకత లేదన్నారు. సీబీఐ విచారణకు ఇచ్చిన అంశాల్లో స్పష్టత కరువైందని చెప్పారు. నాడు కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని జైలులో పెడతామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్.. ఇప్పుడు వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం కాళేశ్వరం మాత్రమే కాకుండా ధరణి పోర్టల్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ కుంభకోణం, ఫార్ములా ఈ-రేసింగ్, ఓఆర్ఆర్ లీజు టెండర్ల వంటి గత ప్రభుత్వ అక్రమాలన్నింటిపై స్పష్టమైన ఆదేశాలతో సీబీఐ విచారణ జరిపించే ధైర్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.
మూడు బ్యారేజీలపైనే విచారణ...
సీబీఐ కి ఇచ్చామని అంటున్నరు. లక్ష కోట్ల అవినీతిలో కేవలం మూడు బ్యారేజీలపైనే విచారణ జరిపించారు. ఎంత అవినీతి జరిగింది. ఎలా జరిగింది అనే అంశాన్ని తేల్చలేదు. కమిషన్‌లో రిపోర్టునే అవినీతి లేకుండా ఇచ్చి సీబీఐకి ఇస్తే ఏం లాభం? వందల పేజీల నివేదిక ఇచ్చి అనేక మంది అధికారులను అందులో భాగం చేసి వారి పేర్లు కూడా ఇవ్వలేదు. ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ ద్వారా సీబీఐ టేకప్ చేస్తలేదని సీఎం అనడం బాధాకరం.
మాకు అనుమానాలు ఉన్నాయి..
పారదర్శకత ఎందుకని లేదు. సిట్‌లు వేసినా, విచారణ జరిపించినా, కొన్నింటికి విచారణ ఆదేశాలు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. 2025, ఆగస్టు 7న ఢిల్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్ ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటికే ఫామ్ హౌస్ జైల్లో ఉన్నాడని సీఎం అనడం వెనక ఉద్దేశం ఏంటి. కేసీఆర్, వారి కుటుంబ సభ్యులపైన రేవంత్‌కు కేసులు పెట్టే ఉద్దేశం లేదా? విచారణ జరిపించాలనే ఉద్దేశం లేదా? అని ప్రశ్నించారు. దీనిపై మాకు అనుమానాలు వస్తున్నాయని ఏలేటి చెప్పారు.
చిలుక పలుకులు పలుకుతున్నరు..
కేసీఆర్‌ను ఉరి తీసినా తప్పు లేదని మాట్లాడిన ముఖ్యమంత్రి సీఎం మాటలనే నేను చెబుతున్నా. ఆరోజు రేవంత్ అనేక ఆరోపణలు చేశారు. ఎందుకోసం చేశారు. మరి విచారణ ఎందుకు జరపడం లేదు. కాలయాపన ఎందుకు చేస్తున్నారు. ఎందుకు చిలుక పలుకులు పలుకుతున్నరు అని మండిపడ్డారు.
సీఎం అయ్యాక మాట మార్చిండు..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ధరణి పోర్టల్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు,
ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ ఫార్ములా రేసింగ్, ఓఆర్ఆర్ లీజు టెండర్ల వంటి అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ మాట్లాడారు. వీటన్నింటిపై విచారణ జరపకుండా, సీబీఐ విచారణకు ఇవ్వకుండా కేవలం ఒక అంశాన్ని పట్టుకొని సీబీఐకి ఇచ్చామంటున్నారు. నిజంగా సీబీఐకి ఇవ్వాలనుకుంటే స్పష్టంగా పారదర్శకతతో కూడిన ఆదేశాలివ్వాలి. మేం కూడా విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నం అని ఏలేటి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



