Sabarimala Ayyappa | ఇకపై ఇంటికే అయ్యప్ప ప్రసాదం
Sabarimala Ayyappa | దేశంలోనే ప్రత్యేకమైన శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయ అరవణ (Aravana Prasadam) ప్రసాదాన్ని ఇంటి నుంచే పొందే అవకాశాన్ని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (Travancore Devaswom Board), తపాలా శాఖ (Postal Department) కల్పించాయి.
Sabarimala Ayyappa | ఇకనుంచి శబరిమల (Sabarimala) వెళ్లకుండానే శబరిమల అయ్యప్ప ప్రసాదాన్ని (Ayyappa Prasadam) నేరుగా ఇంటికే పొందవచ్చు. మనం ఉన్న చోటు నుంచే పోస్టాఫీసుల ద్వారా ఆర్డర్ చేస్తే సరిపోతుంది. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (Travancore Devaswom Board) తపాలా శాఖ (Postal Department)తో ఒప్పందం కుదుర్చుకుంది. శబరిమలలోని పోస్టాఫీస్ (Post Office) భక్తుల కోసం ఇంటి నుంచే ప్రసాదం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ఎంతో ప్రత్యేకమైన శబరిమల ప్రసాదాన్ని ఇంటికే తెప్పించుకోవచ్చు.
దేశంలోని ఎక్కడి నుంచైనా సరే...
దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా సరే ఈ ప్రసాదాన్ని కొనుగోలు చేయవచ్చు. ముందుగా ఏదైనా పోస్టాఫీసు నుంచి మనకు కావాల్సిన ప్రసాదం ధర చెల్లిస్తే, కొద్దిరోజుల్లోనే ప్రసాదాన్ని పోస్టల్ సిబ్బంది స్వయంగా ఇంటికే వచ్చి అందజేస్తారు. దేశంలోని అయ్యప్ప భక్తులందరికీ శబరిమల ప్రసాదం అందడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని శబరిమల పోస్టాఫీస్ అధికారులు తెలిపారు.
ప్రసాదంలో నెయ్యి, అరవణ ప్రసాదం (Aravana Prasadam), పసుపు, కుంకుమ, విభూతి, అరచనై ప్రసాదం ఉంటాయి.
ధరలిలా...
ఒక టిన్ అరవణ ప్రసాదంతో కూడిన కిట్ ధర రూ.520
నాలుగు టిన్‌ల అరవణ ప్రసాదంతో కూడిన కిట్ ధర రూ.960
పది టిన్‌ల అరవణ ప్రసాదంతో కూడిన కిట్ ధర రూ.1760
శబరిమల పోస్టాఫీస్ సైతం ప్రత్యేకం...
ప్రతి ఏడాది అయ్యప్ప ఆలయాన్ని మకర సంక్రాంతి జ్యోతి దర్శనం నిమిత్తం తెరిచి, కొన్ని రోజుల అనంతరం మూసివేసే విషయం తెలిసిందే. అదే విధంగా శబరిమల పోస్టాఫీస్ సైతం ఆలయం తెరిచినప్పడే తెరిచి, తరువాత మూసివేస్తారు. దేశంలో రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) కు మాత్రమే ప్రత్యేక పిన్‌కోడ్ (Pincode)ఉండగా, మరొక ప్రత్యేక పిన్‌కోడ్ ఉన్న పోస్టాఫీస్ సైతం ఇదే కావడం విశేషం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?
జులై 14, 2026

Fixed Deposit | బ్యాంకు వర్సెస్ పోస్టాఫీస్.. ఏ ఎఫ్డీ ఎక్కువ వడ్డీని ఇస్తుంది..?
జూన్ 27, 2026

Padma Awards 2026 | నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రెసిడెంట్
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●KTR SIR | ఓటరు జాబితా సవరణ: ఫ్యామిలీతో కలిసి సర్ ఫారం నింపిన కేటీఆర్.. VIDEO
- ●Mudragada Padmanabham Passes Away | కాపు ఉద్యమ రథసారథి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- ●SIR | 'సర్'లో అనేక లోటుపాట్లు.. ఎస్ఈసీకి బీఆర్ఎస్ వినతి
- ●Ponguleti Srinivas Reddy | 20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లకు శ్రీకారం
- ●Bhatti Vikramarka | బావ, బామ్మర్దులకు గతం లేదు.. భవిష్యత్తూ లేదు : భట్టి విక్రమార్క
- ●Sonam Wangchuk | సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష - బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు - కారణం ఇదే!

KTR SIR | ఓటరు జాబితా సవరణ: ఫ్యామిలీతో కలిసి సర్ ఫారం నింపిన కేటీఆర్.. VIDEO

Mudragada Padmanabham Passes Away | కాపు ఉద్యమ రథసారథి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

SIR | 'సర్'లో అనేక లోటుపాట్లు.. ఎస్ఈసీకి బీఆర్ఎస్ వినతి

Ponguleti Srinivas Reddy | 20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లకు శ్రీకారం



