త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | శ‌భాష్ ఫిరోజ్‌.. బాలిక‌ను ర‌క్షించిన యువ‌కుడికి సీపీ ప్ర‌శంస‌

CP Sajjanar | ఆపదలో ఉన్న ఓ ఎనిమిదేళ్ల బాలిక(Girl)ను తన సమయస్ఫూర్తితో రక్షించిన మహ్మద్ ఫిరోజ్(Firoz) ను సీపీ సజ్జనార్ (CP Sajjanar) అభినందించారు. బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన బ్లూ కోట్స్ కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్ సింగ్ ను ప్రత్యేకంగా అభినందించారు.

S

News | Published On Apr 6, 2026, 6.03 pm IST

CP Sajjanar | శ‌భాష్ ఫిరోజ్‌.. బాలిక‌ను ర‌క్షించిన యువ‌కుడికి సీపీ ప్ర‌శంస‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఆపదలో ఉన్న ఓ ఎనిమిదేళ్ల బాలిక(Girl)ను తన సమయస్ఫూర్తితో రక్షించిన (Rescuing) మహ్మద్ ఫిరోజ్(Firoz) ను సీపీ సజ్జనార్ (CP Sajjanar) అభినందించారు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే గుణం సమాజానికి ఆదర్శమని కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయస్ఫూర్తిని, సాహసాన్ని అలవరచుకోవాలని కోరారు. బషీర్ బాగ్ లో సోమవారం అధికారుల‌తో కలిసి ఫిరోజ్‌ను సత్కరించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన బ్లూ కోట్స్ కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్ సింగ్ ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ నెల 1న అబిడ్స్ లో ఇంటికి వెళ్తున్న బాలికను మెహదీపట్నం హిల్స్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సలీం మాయమాటలతో తన ఆటోలోకి ఎక్కించుకున్నాడు. గోల్కొండలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అదే సమయంలో అటునుంచి వెళ్తున్న‌ ఫిరోజ్ చిన్నారి ఏడుపును గమనించాడు. ఆటో వ‌ద్ద‌కెళ్లి చిన్నారిని ప్రశ్నించగా విష‌యం చెప్పింది. దీంతో నిందితుడు బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు. బాలిక ఐడీ కార్డులోని ఫోన్‌ నెంబర్ ఆధారంగా ఆమె తండ్రికి ఫిరోజ్‌ సమాచారం అందించారు. నిందితుడు సలీంను ఏప్రిల్ 2న అరెస్ట్ చేసిన పోలీసులు, ఆటోను సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ కార్యక్రమంలో అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ ఎన్.శ్వేత, డీసీపీలు కె.శిల్పవల్లి, శ్రీ.ఎస్.శ్రీనివాస్, లావణ్య నాయక్ జాదవ్, ఏసీపీ అబిడ్స్ పి.ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement