త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttham Kumar Reddy | పెట్రోల్, గ్యాస్ సరఫరాపై ఒత్తిడిని నియంత్రించాం: ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి

Uttham Kumar Reddy | పెట్రోలియం (Petroleum) ఉత్పత్తులతో పాటు ఎల్.పి.జి (LPG) సరఫరాలో పెరిగిన ఒత్తిడిని ప్రభుత్వం సమర్థంగా నియంత్రించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttham Kumar Reddy) పేర్కొన్నారు. వినియోగదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణాకు పంపిణీ చేసే కేటాయింపులను పెంచాలని ఆయన కేంద్ర మంత్రులను కోరారు.

S

News | Published On Mar 28, 2026, 5.36 pm IST

Uttham Kumar Reddy | పెట్రోల్, గ్యాస్ సరఫరాపై ఒత్తిడిని నియంత్రించాం: ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: పెట్రోలియం (Petroleum) ఉత్పత్తులతో పాటు ఎల్.పి.జి (LPG) సరఫరాలో పెరిగిన ఒత్తిడిని ప్రభుత్వం సమర్థంగా నియంత్రించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttham Kumar Reddy) పేర్కొన్నారు. వినియోగదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖా మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హార్దీప్ సింగ్ పురి, ప్రహ్లాద్ జోషీలు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ (Video conference) లో శనివారం తెలంగాణ నుంచి ఉత్తమ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఇరాన్-అమెరికాల మధ్య కొనసాగుతున్న యుద్ద ప్రభావంతో పెట్రోలియం, వంటగ్యాస్ సరఫరాపై ప్రజల్లో అపోహలున్నాయ‌ని.. ఒక్క‌సారిగా భయాందోళనలు పెరగడంతో ఇబ్బంది ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల‌తో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింద‌న్నారు. ఒత్తిడిని నియంత్రించ గలిగామన్నారు. ప్ర‌స్తుతం డిమాండ్ కు తగిన రీతిలో సరఫరా కొనసాగుతోందని చెప్పారు. తాను స్వయంగా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పంపిణీదారులతో సమీక్షలు నిర్వహిస్తున్నానని తెలిపారు.

పి.ఎన్.జీ నెట్ విస్తరణలో కేంద్రంతో స‌మ‌న్వ‌యం...

వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్.పి.జి కొరతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణాకు పంపిణీ చేసే కేటాయింపులను పెంచాలని ఆయన కేంద్ర మంత్రులను కోరారు. కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న అంశంపై ఉక్కుపాదం మోపినట్లు వెల్ల‌డించారు. బ్లాక్ మార్కెట్ కు తరలించడంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెంచి కేసులు నమోదు చేసినట్లు ఆయన స్ప‌ష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పైపుల ద్వారా వంటగ్యాస్ సరఫరా నెట్ వర్క్ విస్తరణలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తామ‌న్నారు.

హైదరాబాద్ లో భాగ్యనగర్ గ్యాస్ సంస్థ ద్వారా సి.ఎన్.జి సరఫరాను విస్తరిస్తున్నామన్నారు. జంట నగరాల్లో ఆటోలు, ట్యాక్సీ లతో పాటు ప్రయివేటు వాహనాలకు సి.ఎన్.జీ సరఫరా కోసం ఫిల్లింగ్ కేంద్రాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement