త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Babu Jagjivan ram | బాబు బాట‌లో న‌డ‌వ‌డ‌మే ఆయ‌న‌కు నిజ‌మైన నివాళి: రావుల‌, ఆర్ఎస్పీ

Babu Jagjivan ram | బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan ram) చూపిన బాట‌లో న‌డ‌వ‌డ‌మే ఆయ‌నకు నిజ‌మైన నివాళి అని పార్లమెంట్ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి (Chandrashekar Reddy), బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. తెలంగాణ భవన్‌లో జగ్జీవన్ రామ్ జయంతి (Birth anniversary) వేడుకలను ఆదివారం ఘ‌నంగా నిర్వ‌హించారు.

S

News | Published On Apr 5, 2026, 6.06 pm IST

Babu Jagjivan ram | బాబు బాట‌లో న‌డ‌వ‌డ‌మే ఆయ‌న‌కు నిజ‌మైన నివాళి: రావుల‌, ఆర్ఎస్పీ
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan ram) చూపిన బాట‌లో న‌డ‌వ‌డ‌మే ఆయ‌నకు నిజ‌మైన నివాళి అని పార్లమెంట్ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి (Chandrashekar Reddy), బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. తెలంగాణ భవన్‌లో జగ్జీవన్ రామ్ జయంతి (Birth anniversary) వేడుకలను ఆదివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆయ‌న‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు.

అనంత‌రం వారు మాట్లాడారు. అణగారిన వర్గాల కోసం జగ్జీవ‌న్ రామ్ పాటుప‌డ్డార‌న్నారు. సమాజంలో సమానత్వం కోసం బాట చూపిన మ‌హ‌నీయుడు అని కొనియాడారు. ఆయ‌న‌ చూపిన బాటలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి పేర్కొన్నారు. జడ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్‌ తుల ఉమ, మహిళా నాయకురాలు సుమిత్ర, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, విద్యార్థి నాయకులు హరిబాబు, అమరేందర్ తదితరులు పాల్గొని బాబుజీకి నివాళుల‌ర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు పట్ల శశిధర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేందర్, కిశోర్ గౌడ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement