త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virosh Wedding | విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లికి రెండు ముహూర్తాలు – గీత‌గోవిందం పాట‌ల‌కు విరోష్ డ్యాన్స్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న పెళ్లి నేడు జ‌రుగ‌నుంది. హిందూ సంప్ర‌దాయంతో పాటు కొడ‌వ ఆచారం ప్ర‌కారం రెండు సార్లు ఈ జంట పెళ్లిచేసుకోబోతున్నారు.

N

News | Published On Feb 26, 2026, 9.37 am IST

Virosh Wedding | విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లికి రెండు ముహూర్తాలు – గీత‌గోవిందం పాట‌ల‌కు విరోష్ డ్యాన్స్‌
Advertisement

Virosh Wedding | విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న నేడు పెళ్లితో ఒక్క‌టి కాబోతున్నారు. రాజ‌స్థాన్ ఉద‌య్‌పూర్‌లోని ఐటీసీ మెమోంటోస్ హోట‌ల్‌లో వీరి వివాహం జ‌రుగ‌నుంది. విరోష్ పెళ్లి కోసం రెండు ముహూర్త‌లు ఫిక్స్ చేశారు. తెలుగు సంప్ర‌దాయ ప‌ద్ద‌తితో పాటు ర‌ష్మిక మంద‌న్న‌కు చెందిన కొడ‌వ‌ఆచారం ప్ర‌కారం కూడా విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లి చేసుకోనున్నార‌ట‌.

రెండు ప‌ద్ద‌తుల్లో...

హిందూ సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో ఉద‌యం 10.10 నిమిషాల‌కు విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లి జ‌రుగ‌నుంది. ఆ త‌ర్వాత సాయంత్రం 4.10 నిమిషాల‌కు కొడ‌వ‌ ఆచారం ప్ర‌కారం మ‌రోసారి వీరిద్ద‌రు వివాహ వేడుక జ‌రుగ‌నుంది. పెళ్లి ఫొటోల‌ను సాయంత్రం రిలీజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
సంగీత్‌లో డ్యాన్స్‌....

బుధ‌వారం రాత్రి సంగీత్ వేడుక జ‌రిగింది. ఇందులో విజ‌య్‌, ర‌ష్మిక క‌లిసి డ్యాన్స్ చేశారు. గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ సినిమాల్లోని పాట‌ల‌కు వీరిద్ద‌రు క‌లిసి వేసిన స్టెప్పులు వేశార‌ట‌. ఈ పాట‌ల‌తో త‌మ ల‌వ్‌జ‌ర్నీని మ‌రోసారి వీరిద్ద‌రు గుర్తుచేసుకున్నార‌ట‌. పుష్ప 2 సాంగ్స్ సంగీత్ వేడుక‌కు ఫుల్ జోష్‌ను తెచ్చిన‌ట్లు స‌మాచారం.

హ‌ల్దీ సెల‌బ్రేష‌న్స్‌

బుధ‌వారం విజ‌య్‌, ర‌ష్మిక హ‌ల్దీ సెల‌బ్రేష‌న్స్ కూడా జ‌రిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ పెళ్లి వేడుక‌ల్లో హీరోయిన్లు ఆషికా రంగ‌నాథ్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ పాల్గొన్నారు. హ‌ల్దీ వేడుక తాలూకు ఫొటోల‌ను త‌మ ఇన్‌స్టాలో షేర్ చేశారు.
విజ‌య్ ర‌ష్మిక పెళ్లి వేడుక‌ల్లో డైరెక్ట‌ర్ సందీప్ వంగాతో పాటు త‌రుణ్ భాస్క‌ర్‌, ఈషారెబ్బా కూడా పాల్గొన‌నున్నారు.

Advertisement
Advertisement