త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranabaali | వంద రోజులు కంప్లీట్ చేస్తున్న ర‌ణ‌బాలి – చెప్పిన డేట్‌కే థియేట‌ర్ల‌లోకి విజ‌య్‌, ర‌ష్మిక మూవీ

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ ర‌ణ‌బాలిపై క్రేజీ అప్‌డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. గండికోట‌లో జ‌రిగిన లేటెస్ట్ షెడ్యూల్ పూర్త‌యిన‌ట్లు ప్ర‌క‌టించారు.ఈ షెడ్యూల్‌తో ర‌ణ‌బాలి షూటింగ్ వంద రోజులు పూర్తిచేసుకున్న‌ట్లు చెప్పారు.

N

News | Published On Jun 6, 2026, 3.48 pm IST

Ranabaali | వంద రోజులు కంప్లీట్ చేస్తున్న ర‌ణ‌బాలి – చెప్పిన డేట్‌కే థియేట‌ర్ల‌లోకి విజ‌య్‌, ర‌ష్మిక మూవీ
Advertisement

Ranabaali |  పెళ్లి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న మూవీ ర‌ణ‌బాలి. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియ‌న్ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది. 19వ శ‌తాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన వాస్త‌వ ఘటనల ఆధారంగా ర‌ణ‌బాలి రూపొందుతోంది.

90 శాతం పూర్తి...

ఈ హిస్టారిక‌ల్ మూవీ క్రేజీ అప్‌డేట్‌ను మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు. ర‌ణ‌బాలి షూటింగ్ దాదాపు 90 శాతానికిపైగా కంప్లీట్ అయిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ గండికోట‌లో కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న పాల్గొన్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ల‌వ్‌, ఎమోష‌న‌ల్ సీన్ల‌ను ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్యాన్ చిత్రీక‌రించార‌ట‌. ఈ షెడ్యూల్‌తో ర‌ణ‌బాలి షూటింగ్ వంద రోజుల‌ను పూర్తిచేసుకుంద‌ని అన్నారు. ఔట్‌పుట్ విష‌యంలో ఫుల్ హ్యాపీగా ఉన్న‌ట్లు మేక‌ర్స్ సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ర‌ణ‌బాలికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయ‌ట.

రిలీజ్ డేట్‌పై క్లారిటీ...

ర‌ణ‌బాలి వాయిదాప‌డే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్ల‌పై క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 11నే ఈ సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో హాలీవుడ్ న‌టుడు ఆర్నాల్డ్ వోస్లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. బండి నారాయ‌ణ‌స్వామి రాసిన శ‌ప్త‌భూమి న‌వ‌ల ఆధారంగా ర‌ణ‌బాలి సినిమా రూపొందుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో బ్రిటీష‌ర్ల‌ను ఎదురించిన పోరాడిన రాయ‌ల‌సీమ‌కు చెందిన ర‌ణ‌బాలి అనే యోధుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించ‌బోతుండ‌గా...అత‌డి భార్య జ‌య‌మ్మ‌గా ర‌ష్మిక న‌టిస్తోంది.
గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత విజ‌య్‌, ర‌ష్మిక కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూడో మూవీ ఇది.

 

Advertisement
Advertisement