Rashmika Mandanna | పెళ్లి వేడుకలపై రష్మిక ఎమోషనల్ పోస్ట్ – నేషనల్ క్రష్ ఏమన్నదంటే?
పెళ్లి వేడుకలపై రష్మిక చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత రెండు వారాల్లో ఎంతో ఆనందంగా గడిచపోయాయని అన్నది. ప్రతి రోజు, ప్రతి వేడుక ఎన్నో మధురమైన అనుభూతులను మిగిల్చాయని చెప్పింది.
Rashmika Mandanna | పెళ్లితో గత పది రోజులుగా వార్తల్లో నిలుస్తోన్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ జంట వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భార్య రష్మిక తో కలిసి ఫస్ట్ టైమ్ సొంత ఊరు తుమ్మన్‌పేట వెళ్లాడు విజయ్ దేవరకొండ. సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు నూతన గృహ ప్రవేశ పూజలు కలిసి చేశారు. బుధవారం విజయ్, రష్మిక తమ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఈ వివాహ విందులో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. బుధవారం నాటితో తమ పెళ్లి వేడుకలు ముగిశాయని విజయ్, రష్మిక ప్రకటించారు. తాము అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతున్నట్లు వెల్లడించారు.
ప్రతిరోజు...ప్రతి క్షణం...
ఈ పెళ్లి వేడుకలపై రష్మిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. "గత రెండు వారాలు మా జీవితంలో ఎంతో ఆనందంగా గడిచిపోయాయి. ప్రతి రోజూ, ప్రతి వేడుక, ప్రతి క్షణం ... మాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చాయి. పెళ్లి వేడుకల్లో భాగమైన ప్రతి ఒక్కరూ మాపై ఎనలేని ప్రేమను కురిపించారు. వారందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాం విత్ లవ్...విజయ్ అండ్ రష్మిక" అంటూ తన ట్వీట్‌లో రష్మిక పేర్కొన్నది. ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది.
నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్...
పెళ్లి వేడుకలను ముగించిన విరోష్ జోడీ నెక్స్ట్ వీక్ నుంచి తిరిగి షూటింగ్‌లలో అడుగుపెట్టబోతున్నట్లు చెబుతోన్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి కలిసి రణబాలి అనే సినిమా చేస్తోన్నారు. పీరియాడికల్ యాక్షన్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో బ్రిటీషర్లను ఎదురించిన యోధుడిగా విజయ్ దేవరకొండ కనిపించబోతుండగా...జయమ్మ అనే పాత్రలో రష్మిక నటిస్తోంది. ఈ సినిమాలోనూ వీరిద్దరు భార్యభర్తలుగానే నటిస్తుండటం గమనార్హం. మార్చి 12 నుంచి రణబాలి షూటింగ్‌ను విజయ్, రష్మిక తిరిగి మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ ఇది. గతంలో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జంటగా నటించారు విజయ్, రష్మిక.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Rashmika | రణబాలి సెట్స్‌లో విజయ్-రష్మిక… కొత్త జంటకు గ్రాండ్ వెల్కమ్!
ఏప్రిల్ 11, 2026

Vijay Rashmika | కొడవ సంప్రదాయంలో విజయ్, రష్మిక రిసెప్షన్ – పెళ్లైన నెల తర్వాత వేడుకలు
ఏప్రిల్ 7, 2026

Rashmika Mandanna | పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు – భర్త విజయ్‌తో కలిసి సింపుల్ సెలబ్రేట్ చేసుకున్న రష్మిక
ఏప్రిల్ 6, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



