Thalasani Srinivas Yadav | ఇది అధికార అహంకారం.. దుర్మార్గం.. అనైతికం: గజ్వేల్ ఘటనపై తలసాని ఫైర్
Thalasani Srinivas Yadav | గజ్వేల్ (Gajwel) ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం (MLA Camp Office) పై కాంగ్రెస్ గుండాల దాడి అనైతిక చర్య అని మాజీ మంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) అభివర్ణించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఇలాంటి దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు లేదన్నారు.
త్రినేత్ర.న్యూస్: గజ్వేల్ (Gajwel) ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం (MLA Camp Office) పై కాంగ్రెస్ గుండాల దాడి అనైతిక చర్య అని మాజీ మంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) అభివర్ణించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఇలాంటి దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు లేదన్నారు. ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మాట మార్చిందని మండిపడ్డారు. హామీలను వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైరయ్యారు. హామీలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. బాధ్యులపై కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాడులు ఆపకుంటే ఎదురు దాడులే: శంభీపూర్ రాజు
గజ్వేల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ ఫొటోను తొలగించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోను పెట్టడం రాజకీయ సంస్కృతికి మచ్చ. ఇది సాధారణ రాజకీయం కాదు.. ముమ్మాటికీ గూండాగిరే. అధికారం అహంకారంతో కాకుండా బాధ్యతతో వ్యవహరించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉంది. ప్రజాస్వామ్యంలో బలవంతపు చర్యలకు, దాడులకు ఎలాంటి స్థానం లేదు. కాంగ్రెస్ దాడులు ఆపకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు మౌనం వీడతారు. ఎదురు దాడి తప్పవు. ఈ ఘటనలో వెంటనే కాంగ్రెస్ నాయకత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు (MLC Shambhipur Raju) డిమాండ్ చేశారు.
పిచ్చెక్కిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారు: దేవీ ప్రసాద్, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్
గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి దుర్మార్గం. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ సహిస్తలేదు. దీంతో ఆ పార్టీ నేతలు పిచ్చెక్కిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆస్తి. దానిపై దాడి చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే. గతంలో ఇలాంటి ఘటనలు సిద్దిపేట, పటాన్‌చెరు క్యాంపు కార్యాలయాలపై జరిగాయి. దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి, కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి.
ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
"ఇందిరమ్మ రాజ్యం" అని చెప్పుకుంటూ, రేవంత్ రాష్ట్రాన్ని పూర్తిగా "గూండాల రాజ్యం"గా మార్చేశారు.
ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు… pic.twitter.com/ooVbky9PKy
— BRS Party (@BRSparty) April 4, 2026
Also Read..
Vaddiraju, Niranjan Reddy | పట్టపగలే ఇంత దౌర్జన్యమా? కాంగ్రెస్ గూండాలను కఠినంగా శిక్షించాలే: ఎంపీ వద్దిరాజు, నిరంజన్‌రెడ్డి డిమాండ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






