త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా? లేనట్లా?: హ‌రీశ్ రావు

Harish Rao | ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా? లేనట్లా? అని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) ప్ర‌శ్నించారు.

G

Telangana | Published On May 7, 2026, 1.54 pm IST

Harish Rao | రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా? లేనట్లా?: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా? లేనట్లా? అని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి (Bandi Sanjay) ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకర‌మ‌న్నారు. క‌రీంన‌గ‌ర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంపై, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ శ్రేణుల దాడిని ఖండించారు.

దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

 

Advertisement
Advertisement