MLA Kotta Prabhakar Reddy | ‘క్యాంప్ ఆఫీస్‌పై దాడి’ కాంగ్రెస్ ఇచ్చిన ఏడో గ్యారంటీ: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా
MLA Kotta Prabhakar Reddy | గజ్వేల్ (Gajwel) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (camp office) పై దాడి చేసి కాంగ్రెస్ ఏడో గ్యారంటీ ఇచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotta Prabhakar Reddy) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
త్రినేత్ర.న్యూస్: గజ్వేల్ (Gajwel) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (camp office) పై దాడి చేసి కాంగ్రెస్ ఏడో గ్యారంటీ ఇచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotta Prabhakar Reddy) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది కేవలం ఒక కార్యాలయంపై జరిగిన దాడి కాదని, యావత్ తెలంగాణ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
బీహార్ గ్యాంగ్ సంస్కృతి తెలంగాణకు దిగుమతి..
పట్టపగలు, అందరూ చూస్తుండగానే దాడి చేశారంటే దీని వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా ఉన్నారని ఆరోపించారు. బీహార్ గ్యాంగ్ సంస్కృతిని తెలంగాణకు దిగుమతి చేస్తున్నారా? రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? లేక కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు పోలీసులు పహారా కాస్తున్నారా? అంటూ నిప్పులు చెరిగారు. ప్రజా పాలనంటే 'హేట్ స్పీచ్ బిల్' అంటూ గొంతు నొక్కడం, మరోవైపు గూండాలతో దాడులు చేయించడమేనా అని ప్రశ్నించారు.
'ఫ్రీ హ్యాండ్' ఇచ్చి దాడులు..
ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటూనే దాడులు చేసి కాంగ్రెస్ ఏడో గ్యారంటీ ఇచ్చిందన్నారు. నేడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల కార్యాలయాలను ధ్వంసం చేస్తూ అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందని మండిపడ్డారు. సీఎం, మంత్రులు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో ఉంటే, ఇక్కడ కార్యకర్తలకు 'ఫ్రీ హ్యాండ్' ఇచ్చి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అణచివేతలతో ఉద్యమ పార్టీని ఆపడం మీ తరం కాదన్నారు. మీ నిర్బంధాలకు, గూండాగిరీకి బీఆర్ఎస్ భయపడదని.. ప్రజల పక్షాన నిలబడి మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తామని హెచ్చరించారు.
గజ్వేల్ లో దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డీజీపీని డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలే రోడ్లపైకి రావడం ఖాయమన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






