Devi Prasad | కాంగ్రెస్ ప్రభుత్వానికి రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు తగుల్తది: ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ నేత దేవీ ప్రసాద్
Devi Prasad | తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల(Retired employees)కు చావే పరిష్కారమైందని.. ఈ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి వారి ఉసురు తప్పకుండా తగులుతుందని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ నాయకులు దేవీ ప్రసాద్(Devi Prasad) మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు 5 డీఎ(DA)లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు.
త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల(Retired employees)కు చావే పరిష్కారమైందని.. ఈ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి వారి ఉసురు తప్పకుండా తగులుతుందని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ నాయకులు దేవీ ప్రసాద్(Devi Prasad) మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందన్నారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు 5 డీఎ(DA)లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. సీపీఎస్(CPS) రద్దుపై ఇప్పటి వరకు కమిటీ వేయలేదన్నారు. ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి..
రాష్ట్రంలో 14 వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు 86 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందారు. సీఎం, మంత్రులు ఇక్కడ లేరని.. సెక్రటేరియట్ నుంచి గ్రామ సచివాలయం వరకు ఉద్యోగులు ఆందోళన చేశారని గుర్తుచేశారు. చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగులకు కోటి 20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు.
ఉద్యోగుల్లో ఆంధ్రా పెత్తనం..
ఉద్యోగుల విషయంలో కాంగ్రెస్, బీజేపీ వైఖరి ఒకటే. ఉద్యోగుల్లో ఆంధ్రా పెత్తనం నడుస్తోంది. ఎక్సైజ్ శాఖలో కమిషనర్ వేధింపులు తట్టుకోలేక తెలంగాణ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇరిగేషన్ శాఖలో ఆంధ్రా పెత్తనం ఉంది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య సోదర బంధం వేరే చెప్పనక్కర్లేదు. బీజేపీ రాజకీయంతోనే మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లు ఆగిపోయింది. డీలిమిటేషన్, మహిళా బిల్లును లింక్ చేశారు. ఒకవైపు బీజేపీ హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తే ఢిల్లీలో రేవంత్ రెడ్డి బీజేపీ కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లారు. రేవంత్ రెడ్డి చెప్పిన హైబ్రిడ్ మోడల్ విధానం అంటే అన్ని పార్టీలతో కుమ్మక్కు కావడమే అని ఎద్దేవా చేశారు.
బీజేపీ 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎందుకు అమలు చేయలేదు? రేపోమాపో రేవంత్ రెడ్డి బీజేపీతో కలవడం ఖాయం. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ను ఉత్తరప్రదేశ్ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఆరోపించి ఆయనతో చెట్ట పట్టాల్ ఎందుకు? కాంగ్రెస్ నేతలు అలెర్ట్ గా ఉండాలి. కాంగ్రెస్ ను హైబ్రిడ్ విధానంలో హోల్ సేల్ గా రేవంత్ రెడ్డి అమ్మడం ఖాయం. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో ఒక్కటి అయ్యాయి. రేవంత్ రెడ్డికి ప్రొటెక్టర్ గా తెలంగాణ బీజేపీ ఉంది అని దేవీ ప్రసాద్ ఆరోపించారు.
తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించే ధైర్యం బీజేపీకి లేదు: టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్
30 ఏళ్లుగా మహిళా బిల్లును కాంగ్రెస్, బీజేపీ అడ్డుకుంటున్నాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో మిగతా బిల్లులను బీజేపీ ఎందుకు పెట్టింది? ఇది బీజేపీ చేసిన కుట్ర. మహిళా రిజర్వేషన్ల అమలు కావడం బీజేపీకి ఇష్టం లేదు. బీజేపీకి కావాల్సిన బిల్లులను పాస్ చేసుకుంటుంది. నారీ శక్తి వందన్ పేరుతో తెచ్చిన బిల్లుపై వారికి చిత్తశుద్ధి లేదు. ఎన్నికల్లో లబ్ది కోసమే ఈ బిల్లులు తెచ్చింది. మహిళల పట్ల బీజేపీ, కాంగ్రెస్ వైఖరి తేలిపోయింది. కేసీఆర్ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ల తీర్మానం పాస్ చేసి ఢిల్లీకి పంపారు.
మార్కెట్ కమిటీల్లో కేసీఆర్ రిజర్వేషన్లు ఇచ్చారు: ఉపాధ్యాయ సంఘం మాజీ నేత భుజంగ రావు
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల రేవంత్ సర్కార్ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం పట్ల ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. సరైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కర్రు కాల్చి వాత పెడతారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



