త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | కరీంనగర్ రాజకీయాలను చెడ గొడుతున్న బండి సంజ‌య్‌: బీఆర్ఎస్ నేత‌లు

BRS | క‌రీంన‌గ‌ర్‌లో (Karimnagar) ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంపై బీజేపీ (BJP) కార్య‌క‌ర్త‌లు దాడిచేయ‌డాన్ని మండ‌లిలో బీఆర్ఎస్ (BRS) ఉప నేత ఎల్ ర‌మ‌ణ‌, కోరుట్ల ఎమ్మెల్యే కే. సంజ‌య్ తీవ్రంగా ఖండించారు. శాంతి భ‌ద్ర‌త‌లు చూడాల్సిన కేంద్ర మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) త‌న అనుచ‌రుల‌తో ప్ర‌భుత్వ కార్యాల‌యంపై దాడి చేయించార‌ని విమ‌ర్శించారు.

G

Telangana | Published On May 7, 2026, 2.28 pm IST

BRS | కరీంనగర్ రాజకీయాలను చెడ గొడుతున్న బండి సంజ‌య్‌:  బీఆర్ఎస్ నేత‌లు
Advertisement

BRS | త్రినేత్ర‌.న్యూస్‌: క‌రీంన‌గ‌ర్‌లో (Karimnagar) ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంపై బీజేపీ (BJP) కార్య‌క‌ర్త‌లు దాడిచేయ‌డాన్ని మండ‌లిలో బీఆర్ఎస్ (BRS) ఉప నేత ఎల్ ర‌మ‌ణ‌, కోరుట్ల ఎమ్మెల్యే కే. సంజ‌య్ తీవ్రంగా ఖండించారు. శాంతి భ‌ద్ర‌త‌లు చూడాల్సిన కేంద్ర మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) త‌న అనుచ‌రుల‌తో ప్ర‌భుత్వ కార్యాల‌యంపై దాడి చేయించార‌ని విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డి మాటలకు బండి సంజయ్ గుండాలు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద పట్ట పగలు దాడి చేశారని ర‌మ‌ణ విమ‌ర్శించారు. ప్రభుత్వ ఆస్తులను హోమంత్రి సంజయ్ మనుషులు ద్వంసం చేయడం దారుణ‌మ‌ని చెప్పారు.

కేటీఆర్‌పై బండి సంజ‌య్ బజారు భాష వాడార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రశాంతంగా ఉండే కరీంనగర్ రాజకీయాలను చెడ గొడుతున్నారని విమ‌ర్శించారు. ధ్వంసానికి పాల్పడ్డ గుండాలపై పీడీ యాక్ట్ ప్రయోగించాల‌ని, ఆస్తుల ధ్వంసానికి వారి నుంచే నష్ట పరిహారం వసూలు చేయాల‌న్నారు. భాద్యులను వెంటనే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చ‌స్త్రశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయ‌ని మండిప‌డ్డారు.

కరీంనగర్‌లో నగల దుకాణంలో తుపాకులతో బెదిరించి పట్టపగలే బంగారు ఆభరణాలు దోచుకెళ్లార‌ని చెప్పారు. హైదరాబాద్‌లో డీసీపీ సుమతి పట్ల పోకిరీలు ప్రవర్తించిన తీరు శాంతిభద్రతలు దిగజారిన తీరును సూచిస్తున్న‌ద‌ని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బండి సంజయ్ గుండాల దాడిని బీఆర్ఎస్‌ తీవ్రంగా ఖండిస్తున్న‌ద‌ని చెప్పారు. కౌశిక్ రెడ్డి ప్రెస్‌మీట్‌లో అడిగిన ప్రశ్నలకు ప్రెస్‌మీట్ ద్వారానే బండి సంజయ్ సమాధానం చెప్పాల‌న్నారు. దాడి ఘ‌ట‌న‌పై డీజీపీ వెంటనే స్పందించాల‌ని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌కి కు చట్టాల మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా తన గుండాలను పోలీసులకు అప్పగించాల‌న్నారు.

చదువు, సంధ్య లేని బండి సంజయ్..

శాంతి భద్రతల బాధ్యతలు చూడాల్సిన కేంద్ర హోంమంత్రి బండి సంజయ్... ప్రభుత్వ కార్యాలయమైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయించార‌ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విమ‌ర్శించారు. బండి సంజయ్ వ్యవహారాన్ని ప్రధాని మోదీ గమనించాల‌న్నారు. చదువు, సంధ్య లేని బండి సంజయ్ తెలివి లేక దాడి చేయించార‌ని విమ‌ర్శించారు. బీజేపీ ప్రభుత్వం నడిపే దేశం ఇలా ఉంటుందా అని ప్ర‌శ్నించారు. పదేండ్ల‌లో బండి సంజయ్ ఎన్నో మాట్లాడితే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారా అని నిల‌దీశారు.

పోలీసుల పర్యవేక్షణలోనే దాడులకు పాల్పడ్డార‌ని చెప్పారు. ఇక్కడ హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కలిసి మొత్తం భ్రష్టు పట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. పట్టపగలు కాల్పులు జరిపి దోపిడీ చేసి 5 రోజులైనా దొంగలను పట్టుకోలేద‌న్నారు. బండి సంజయ్‌కి తల్లిదండ్రులు ఇదే సంస్కారం నేర్పారా అని ప్ర‌శ్నించారు. ఆయన తన పిల్లలకు ఇదే సంస్కారం నేర్పుతున్నారా అన్నారు. రౌడీ పనులు చేసుకుంటూ ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఇన్ని దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని డీజీపీని నిల‌దీశారు. శాంతి భద్రతలు ఇలా ఉన్నాయి కాబట్టే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేద‌ని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల‌ని, చేత‌గాకపోతే హోం మంత్రిగా రేవంత్ రెడ్డి, కేంద్ర హోంమంత్రిగా బండి సంజయ్ రాజీనామా చేసి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. చేతనైతే విద్య, వైద్యం, గోదావరి జలాలు, మహిళా సంక్షేమం, ఫీజు రీయింబర్స్‌మెంట్, హోంశాఖ గురించి బండి సంజయ్ ఒక పది నిమిషాలు మాట్లాడాల‌న్నారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయ మంత్రని విమ‌ర్శించారు.

Advertisement
Advertisement