త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tigress | అదిగో పులి.. అతి ద‌గ్గ‌రగా చూడ‌డంపై అధికారుల హ‌ర్షం

Tigress | నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవు (Nallamala Forest) ల్లో ఓ ఆడ‌పులి (Tigress) అట‌వీ అధికారుల కంట‌ప‌డింది. పులి అతి ద‌గ్గ‌ర‌గా రావ‌డంతో వారి ఆనందానికి అవ‌దులు లేకుండా పోయాయి. అభయారణ్యంలో పులుల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు.

S

News | Published On Mar 23, 2026, 3.30 pm IST

Tigress | అదిగో పులి.. అతి ద‌గ్గ‌రగా చూడ‌డంపై అధికారుల హ‌ర్షం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవు (Nallamala Forest) ల్లో ఓ ఆడ‌పులి (Tigress) అట‌వీ అధికారుల (Forest officers) కంట‌ప‌డింది. పులి అతి ద‌గ్గ‌ర‌గా రావ‌డంతో వారి ఆనందానికి అవ‌దులు లేకుండా పోయాయి. ఫరహాబాద్ వ్యూ పాయింట్ (Farahabad view point) సమీపంలో F55 ఆడపులి అట‌వీ అధికారుల వాహ‌నానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చింది. దీంతో ఇంత ద‌గ్గ‌ర‌గా పులిని చూడ‌డంపై అధికారులు సంతోషం వ్య‌క్తం చేశారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా PCCF సువర్ణ నల్లమలలో పర్యటిస్తున్నారు. ఈ స‌మ‌యంలో వారికి అతి దగ్గర వ‌చ్చిన‌ పులిని చూడటంపై హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్‌డీ సునీల్, డీఎఫ్‌వో రేవంత్ చంద్ర, ఎఫ్‌డీవో రామ్మూర్తితో క‌లిసి ఆమె అడ‌విలో ప‌ర్య‌టించారు. అభయారణ్యంలో పులుల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు.

[video width="162" height="288" mp4="https://www.trinethra.news/static-media/wp-content/uploads/2026/03/WhatsApp-Video-2026-03-23-at-11.53.48-AM-2.mp4"][/video]

Advertisement

తాజావార్తలు

Advertisement