Sheep | గొర్రెల రక్షణ కోసం.. సూర్యాపేట రైతు అద్భుత ఆవిష్కరణ
Sheep | వారి ఆధారమే గొర్రెలు.. ఆ జీవాలను కంటికి రెప్పలా కాపాడుకుంటే తప్ప బతుకుదెరువు లేదు. రాత్రింబవళ్లు వాటి రక్షణ కోసం కాపలా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు రోడ్డు దాటుతున్న సమయంలో ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి గొర్రెలు. ఈ క్రమంలో ఓ గొర్రెల యజమానికి వినూత్నమైన ఆలోచన తట్టింది.
Sheep | త్రినేత్ర.న్యూస్ : వారి ఆధారమే గొర్రెలు.. ఆ జీవాలను కంటికి రెప్పలా కాపాడుకుంటే తప్ప బతుకుదెరువు లేదు. రాత్రింబవళ్లు వాటి రక్షణ కోసం కాపలా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు రోడ్డు దాటుతున్న సమయంలో ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి గొర్రెలు. ఈ క్రమంలో ఓ గొర్రెల యజమానికి వినూత్నమైన ఆలోచన తట్టింది. గొర్రెలను రోడ్డు దాటించే క్రమంలో వాటిని ఎలా కాపాడుకోవాలనే దానిపై దృష్టి సారించాడు. మొత్తానికి తమకు జీవనాధారమైన గొర్రెలను కాపాడుకునేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. చివరకు విజయం సాధించాడు. తన మందలోని ఏ గొర్రె కూడా రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా కాపాడుకుంటున్నాడు.
మరి ఆ అద్భుత ఆవిష్కరణ ఏంటంటే..?
సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ రైతుకు 100కు పైగా గొర్రెలు ఉన్నాయి. అయితే వాటి మేత కోసం అడవికి తీసుకెళ్లినప్పుడు అక్కడక్కడ రోడ్లు దాటాల్సి వస్తుంది. ఈ క్రమంలో గొర్రెలను ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఢీకొడుతున్నాయి. కొన్ని గొర్రెలు మృత్యువాత పడుతుండగా, మరికొన్ని గాయాల పాలవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆ గొర్రెల యజమానికి ఆలోచన తట్టింది. తన గొర్రెలను కాపాడుకోవడానికి తేలికపాటి వాహనాన్ని తయారు చేశారు. పాత సామాగ్రితో తక్కువ ఖర్చుతో ఇద్దరు సులభంగా తోసేలా రూపొందించారు. ఇక రోడ్డు దాటే సమయంలో గొర్రెలన్నింటినీ ఆ వాహనంలోకి తోసేసి.. నెమ్మదిగా రోడ్డు దాటిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రైతులు ఆ వ్యక్తిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఆ సమయంలో నాకు చాలా బాధేసింది..
ఈ సందర్భంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం గొర్రెలు రోడ్డు దాటుతుండగా.. ఒక గొర్రెను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దానికి దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో నాకు చాలా బాధేసింది. గొర్రెలు ప్రమాదాలకు గురికాకుండా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. దాంతో ప్రయోగత్మకంగా వెహికిల్ తయారు చేశాను. 25 ఫీట్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పుతో ఇనుప కడ్డీలతో రూపొందించాను. ఇందులో 150 వరకు జీవాలు పడుతున్నాయి. పాత సైకిల్ టైర్లు, జాలి ఉపయోగించి రూపొందించాం. ప్రస్తుతం అయితే మా గొర్రెలకు ఎలాంటి ఇబ్బంది లేదని సదరు వ్యక్తి పేర్కొన్నాడు.
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు





