త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala | తిరువ‌నంత‌పురంలో రెప‌రెప‌లాడిన బీజేపీ జెండా

Kerala | కేర‌ళ (Kerala) రాష్ట్రంలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో (Local Body Elections) అధికార ఎల్‌డీఎఫ్ (LDF) కూట‌మికి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌డీఎఫ్ త‌న ప‌ట్టును నిలుపుకోగా, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్ర‌తిప‌క్ష యూడీఎఫ్ (UDF) ఆధిక్యం సాధించింది. తిరువ‌నంత‌పురం (Thiruvananthapuram) కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ (BJP) అత్య‌ధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలిచింది. తిరువ‌నంత‌పురం మేయ‌ర్‌గా కేర‌ళ మాజీ డీజీపీ (DGP) ఆర్ శ్రీలేఖ (R Sreelekha) ఎన్నిక‌వుతార‌ని భావిస్తున్నారు.

A

News | Published On Dec 13, 2025, 7.35 pm IST

Kerala | తిరువ‌నంత‌పురంలో రెప‌రెప‌లాడిన బీజేపీ జెండా
Advertisement

Kerala | కేర‌ళ (Kerala) రాష్ట్రంలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో (Local Body Elections) అధికార ఎల్‌డీఎఫ్ (LDF) కూట‌మికి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. తొలిసారిగా బీజేపీ (BJP) జెండా రెప‌రెప‌లాడింది. తిరువ‌నంత‌పురం (Thiruvananthapuram) కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ అత్య‌ధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌డీఎఫ్ త‌న ప‌ట్టును నిలుపుకోగా, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్ర‌తిప‌క్ష యూడీఎఫ్ (UDF) ఆధిక్యం సాధించింది. తిరువ‌నంత‌పురం కార్పొరేష‌న్ ఎన్‌డీఏ (NDA) వ‌శ‌మైంది.

ఇద్ద‌రు కార్పొరేట‌ర్ల నుంచి మేయ‌ర్ పీఠం దిశ‌గా...

తిరువ‌నంత‌పురం కార్పొరేష‌న్‌లో సుమారు న‌ల‌భై ఏళ్ల క్రితం కేవ‌లం ఇద్ద‌రు బీజేపీ కార్పొరేట‌ర్లు మాత్ర‌మే గెలుపొంద‌గా, ప్ర‌స్తుతం మేయ‌ర్ (Mayor) పీఠం కైవ‌సం చేసుకోబోతోంది. జాతీయ రాజ‌కీయాల్లో సైతం ఒక‌ప్పుడు రెండు ఎంపీ స్థానాల నుంచి ఏకంగా ప్ర‌ధాని పీఠం ద‌క్కించుకున్న బీజేపీ అదే సీన్‌ను తిరువ‌నంత‌పురంలో రిపీట్ చేసింది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ 50 సీట్లు సాధించి, 45 ఏళ్ల నిర్విరామ ఎల్‌డీఎఫ్ పాల‌న‌కు బ్రేక్ వేసింది. 101 సీట్ల‌కు గాను బీజేపీ 50, ఎల్‌డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 విజ‌యం సాధించ‌గా, మ‌రో రెండు స్థానాల్లో స్వ‌తంత్రులు విజ‌య‌బావుటా ఎగుర‌వేశారు.

మేయ‌ర్‌గా కేర‌ళ మాజీ డీజీపీ ?

తిరువ‌నంత‌పురం మేయ‌ర్‌గా కేర‌ళ మాజీ డీజీపీ (DGP) ఆర్ శ్రీలేఖ (R Sreelekha) ఎన్నిక‌వుతార‌ని భావిస్తున్నారు. కేర‌ళ రాష్ట్రానికి చెందిన మొద‌టి మ‌హిళా ఐపీఎస్ కూడా అయిన శ్రీ‌లేఖ‌ను ఆ పార్టీ శాస్త‌మంగ‌ళం డివిజ‌న్ నుంచి బ‌రిలోకి దించింది. ఆ డివిజ‌న్ నుంచి ఆమె గ‌తంలో ఎన్న‌డూ లేనంత మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు. మేయ‌ర్ ప‌ద‌వి అంశంపై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు పార్టీ ఆ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

మిశ్ర‌మ ఫ‌లితాలు...

మొత్తం 941 గ్రామ పంచాయితీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా యూడీఎఫ్ 504 స్థానాలు, ఎల్‌డీఎఫ్ 341 స్థానాలు, ఎన్డీఏ 26 స్థానాలు, ఇత‌రులు ఆరు స్థానాల్లో విజ‌యం సాధించాయి. మ‌రో 64 స్థానాల్లో ఇద్ద‌రూ స‌మాన సంఖ్య‌లో వార్డులు గెలుపొందారు. మొత్తం 152 బ్లాక్ పంచాయితీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా 79 యూడీఎఫ్‌, 63 ఎల్‌డీఎఫ్ గెలుపొంద‌గా, మ‌రో ప‌ది బ్లాక్‌ల‌లో రెండు కూట‌ములు స‌మ ఉజ్జీలుగా నిలిచాయి. మొత్తం 14 జిల్లా పంచాయితీల‌కు గాను యూడీఎఫ్‌, ఎల్‌డీఎఫ్ చెరో ఏడు స్థానాలు సాధించాయి. మొత్తం 87 మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా 54 యూడీఎఫ్‌, 28 ఎల్‌డీఎఫ్‌, రెండు ఎన్‌డీఏ, ఒక‌టి ఇత‌రులు గెలుపొంద‌గా, మ‌రో స్థానంలో ఇరువ‌ర్గాలు స‌మాన వార్డులు గెలుచుకున్నాయి. ఆరు కార్పొరేష‌న్ల‌లో నాలుగు యూడీఎఫ్‌, ఒక‌టి ఎల్‌డీఎఫ్‌, ఒక‌టి ఎన్‌డీఏ గెలుచుకున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement