Sri Rama Navami | కనుల పండువగా భద్రాద్రి రాములోరి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం
Sri Rama Navami | శ్రీరామ నవమిని (Sri Rama Navami) పురస్కరించుకొని భద్రాచలం(Bhadhrachalam) లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కల్యాణ వేడుకల వేళ భద్రాచలం వీధులన్నీ రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), గీత దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు (Silk garments), ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
త్రినేత్ర.న్యూస్: శ్రీరామ నవమిని (Sri Rama Navami) పురస్కరించుకొని భద్రాచలం(Bhadrachalam) లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కల్యాణ వేడుకల వేళ భద్రాచలం వీధులన్నీ రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. మరోవైపు మిథిలా మండపంలో నిర్వహిస్తున్న ఈ క్రతువును కనులారా తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలొచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), గీత దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు (Silk garments), ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తదితరులు కల్యాణ వేడుకలకు హాజరయ్యారు. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం, ఉచిత తలంబ్రాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

అంతకుముందు భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ భూమిపూజ చేశారు. రూ.351 కోట్లతో తొలి విడతలో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. మూడు విడతల్లో పనులు చేయనున్నట్లు సీఎం తెలిపారు. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



