Governor | క్యాన్సర్ మొబైల్ వాహన సేవల ఏర్పాటు మెదక్ ప్రజలకు వరం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Cancer Mobile vehicle | క్యాన్సర్ (Cancer) ను ప్రాథమిక దశ(Primary stage)లో గుర్తిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shivaprathap Shukla) అన్నారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) వారి CSR నిధుల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్ని సోమవారం లోక్ భవన్ లో జెండా ఊపి ప్రారంభించారు.
త్రినేత్ర.న్యూస్: క్యాన్సర్ (Cancer) ను ప్రాథమిక దశ(Primary stage)లో గుర్తిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shivaprathap Shukla) అన్నారు. స్క్రీనింగ్ పరీక్షల మొబైల్ వాహన (Mobile vehicle) సేవలు నేరుగా పల్లెలకే వస్తున్నాయని, మెదక్ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) వారి CSR నిధుల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్ని సోమవారం లోక్ భవన్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొబైల్ స్క్రీనింగ్ వాహనం లో క్యాన్సర్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ కోసం ఉద్దేశించిన సౌకర్యాలను ఎంపీ రఘునందన్ గవర్నర్ కు వివరించారు.

అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) విజ్ఞప్తి మేరకు బీడీఎల్ కంపెనీ మెదక్ ప్రజల కోసం ఒక మొబైల్ వాహనాన్ని అందించడం సంతోషకరమన్నారు. ఆసుపత్రిలో ఉండే స్క్రీనింగ్ సౌకర్యాలు ఈ వాహనంలోనే ఉన్నాయని, ఇవి పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనం ఉపయోగపడుతుందన్నారు. ఎంపీ రఘునందన్ ను, వాహనాన్ని సమకూర్చిన BDL ప్రతినిధులను గవర్నర్ అభినందించారు.
ప్రతి జిల్లా కేంద్రంలో ఒక క్యాన్సర్ ఆసుపత్రి ఉండాలన్న ప్రధాని మోదీ ఆశయంలో భాగంగా ఈ వాహనం మెదక్‌కు ముందే చేరడం సంతోషంగా ఉందని ఎంపీ రఘునందన్ తెలిపారు. ఈ కార్యక్రమం లో BDL అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





