త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGHRC | మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న ఘ‌ట‌న‌ల‌పై టీజీహెచ్ఆర్సీ సీరియ‌స్‌.. సుమోటాగా కేసుల స్వీక‌ర‌ణ‌

TGHRC | తెలంగాణ‌లో జ‌రిగిన మానవ హక్కుల ఉల్లంఘనల ఘ‌ట‌న‌ల‌పై రాష్ట్ర మాన‌వ హక్కుల క‌మిష‌న్ (TGHRC) ఘాటుగా స్పందించింది. ఇందుకు సంబంధించి ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మైన‌ రెండు వార్తల పై సుమోటాగా (SUO-MOTU) కేసులు (Cases) స్వీకరించింది. కుక్క‌ల దాడి బాధిత బాలుడు, వృద్ధ దంప‌తులను నిర్లక్ష్యం చేసిన విషయాల్లో సంబంధిత ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల‌ కలెక్టర్లు నివేదికలు సమర్పించాల్సిందిగా కమిషన్ ఆదేశించింది.

S

News | Published On Mar 31, 2026, 4.33 pm IST

TGHRC | మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న ఘ‌ట‌న‌ల‌పై టీజీహెచ్ఆర్సీ సీరియ‌స్‌.. సుమోటాగా కేసుల స్వీక‌ర‌ణ‌
Advertisement

- కుక్క‌ల దాడి బాధితుడి, వృద్ధ దంపతుల నిర్ల‌క్ష్యంపై నివేదిక‌లు ఇవ్వాల‌ని ఆదేశం

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో జ‌రిగిన మానవ హక్కుల ఉల్లంఘనల ఘ‌ట‌న‌ల‌పై రాష్ట్ర మాన‌వ హక్కుల క‌మిష‌న్ (TGHRC) ఘాటుగా స్పందించింది. ఇందుకు సంబంధించి ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మైన‌ రెండు వార్తల పై సుమోటాగా (SUO-MOTU) కేసులు (Cases) స్వీకరించింది. కుక్క‌ల దాడి బాధిత బాలుడు, వృద్ధ దంప‌తులను నిర్లక్ష్యం చేసిన విషయాల్లో సంబంధిత ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల‌ కలెక్టర్లు నివేదికలు సమర్పించాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాష్ట్ర మాన‌వ హక్కుల ఛైర్పర్సన్ డా.జస్టిస్ షమీమ్ అఖ్తర్ (Justice Shamim Akthar) ప‌లు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

ఓ తెలుగు దినపత్రికలో మార్చి 31న “అమ్మానాన్నలు అంత చేదయ్యారా?” అనే శీర్షిక‌న వార్త ప్ర‌చురిత‌మైంది. ఖమ్మం రూరల్ మండలం, పడమటి తండాకు చెందిన వృద్ధ దంపతులు భూక్య బిక్య (82), ఆయన భార్య హంపిలి (79) తమ కుమారుల చేత నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు ఆ క‌థనంలో వెల్లడైంది. దీనిపై క‌మిష‌న్ సీరియ‌స్ అయింది.

మ‌రో ఆంగ్ల‌ పత్రికలో “Boy loses eye in stray dog attack” అనే వార్త మార్చి 28న ప్ర‌చురిత‌మైంది. యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడికి గురై ఒక కంటిని కోల్పోయాడు. ఈ ఘటన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తుండ‌గా సంబంధిత అధికారుల చర్యలు, బాధితుల సంక్షేమ చర్యలు, నివారణ చర్యల వివరాలను నివేదికలో పొందుపరచాలని సూచించింది. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌పై ఏప్రిల్ 27 లోపు నివేదిక‌లు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement