త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

National Herald | గాంధీభ‌వ‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌… కాంగ్రెస్ శ్రేణుల‌ను అడ్డుకున్న పోలీసులు

National Herald | కాంగ్రెస్ (Congress) అగ్రనేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల‌పై ఈడీ (ED) అక్ర‌మ కేసులకు వ్య‌తిరేకంగా టీపీసీసీ (TPCC) ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ధ‌ర్నాను పోలీసులు అడ్డుకోవ‌డంతో గాంధీభ‌వ‌న్ (Gandhi Bhavan) వ‌ద్ద ఉద్రిక్త‌త త‌లెత్తింది.

A

News | Published On Dec 18, 2025, 1.20 pm IST

National Herald | గాంధీభ‌వ‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌… కాంగ్రెస్ శ్రేణుల‌ను అడ్డుకున్న పోలీసులు
Advertisement

National Herald | కాంగ్రెస్ (Congress) అగ్రనేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల‌పై ఈడీ (ED) అక్ర‌మ కేసులు బ‌నాయించింద‌ని ఆరోపిస్తూ గురువారం రాష్ట్ర‌వ్యాప్త నిర‌స‌న‌ల‌కు టీపీసీసీ (TPCC) పిలుపునిచ్చిన నేప‌థ్యంలో గాంధీభ‌వ‌న్ (Gandhi Bhavan) వ‌ద్ద ఉద్రిక్త‌త త‌లెత్తింది. గాంధీభ‌వ‌న్ నుంచి కాంగ్రెస్ నాయ‌కులు పెద్ద ఎత్తున ర్యాలీగా బ‌య‌ల్దేర‌గా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీభ‌వ‌న్ గేటు ముందే బైఠాయించి, నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మాట్లాడుతూ రాహుల్‌, సోనియాల‌పై బీజేపీ అక్ర‌మ కేసులు మోపుతోంద‌ని మండిప‌డ్డారు. ఢిల్లీ కోర్టులో ఈడీ వేసిన చార్జ్‌షీట్‌ను న్యాయ‌స్థానం కొట్టివేసిందని గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాట స‌మ‌యం నుంచి నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక ఉంద‌ని చెప్పారు. దేశం కోసం ఆస్తులు త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబ‌మ‌ని, అలాంటి కుటుంబంపై కావాల‌నే బీజేపీ వేధింపుల‌కు పాల్ప‌డుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు నిర‌స‌న తెలుపుతున్న‌ట్లు వివ‌రించారు.

కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్ (Meenakshi Natarajan) మాట్లాడుతూ ఎప్ప‌టికైనా స‌త్య‌మే గెలుస్తుంద‌న్నారు. బీజేపీ న‌మోదు చేస్తున్న అక్ర‌మ కేసుల విష‌యంలో ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలుపుతామ‌ని చెప్పారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు ఉన్న గాంధీ పేరును సైతం కేంద్ర ప్ర‌భుత్వం తొల‌గిస్తోంద‌ని విమ‌ర్శించారు. న్యాయం గెలిచేందుకు స‌మ‌యం ప‌డుతున్న‌ప్ప‌టికీ, చివ‌రికి గెలిచేది న్యాయ‌మేన‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement