త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలో అద‌ర‌గొడుతోన్న తెలంగాణ కామెడీ మూవీ

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కిన తురుమ్‌ఖాన్‌లు మూవీ ఇటీవ‌ల ఆహా ఓటీటీలో రిలీజైంది. శ్రీరామ్ నిమ్మ‌ల, ఐశ్వ‌ర్య హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ శివ క‌ళ్యాణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

N

News | Published On Mar 24, 2026, 7.04 pm IST

OTT  | ఓటీటీలో అద‌ర‌గొడుతోన్న తెలంగాణ కామెడీ మూవీ
Advertisement

OTT |  తెలంగాణ యాస, భాషల‌కు ప్రాధాన్య‌మిస్తూ తెర‌కెక్కిన తురుమ్‌ఖాన్‌లు ఇటీవ‌ల ఆహా ఓటీటీలో రిలీజైంది. శ్రీరామ్ నిమ్మ‌ల‌, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశ్వ‌ర్య‌ ఉల్లింగాల, పులి సీత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ఎన్ శివ క‌ళ్యాణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మూడు ప్రేమ‌క‌థ‌ల‌తో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. తురుమ్‌ఖాన్‌లు సినిమాతో ప‌లువురు కొత్త న‌టీన‌టులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయిన ఈ మూవీకి ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వ‌స్తోంద‌ని మేక‌ర్స్ అన్నారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ తెలంగాణ కామెడీ మూవీకి మిలియ‌న్ల వ్యూస్ వ‌స్తున్నాయ‌ని తెలిపారు.

తుపాకుల గూడెం క‌థ‌....

శంకర్‌ (నిమ్మల శ్రీరామ్‌)తుపాకుల గూడెం గ్రామానికి యూత్‌ లీడర్‌గా ఎన్నిక‌వుతాడు. కరోనా సమయంలో మరదలు లలిత(ఐశ్వర్య ఉల్లింగాల)తో శంక‌ర్‌పెళ్లి కుదురుతంది. లాక్‌డౌన్ కార‌ణంగా వివాహం ఆగిపోతుంది త‌న పెళ్లి ఆగిపోవ‌డానికి విరాజ్ బ్ర‌హ్మ‌(దేవరాజ్‌ పాలమూర్‌) కార‌ణ‌మ‌ని అత‌డిపై శంక‌ర్ ప‌గ‌ను పెంచుకుంటాడు. అదే టైమ్‌లో బ్ర‌హ్మ లైఫ్‌లోకి భారతి(పులి సీత) ఎంట‌ర‌వుతుంది. శంకర్‌ స్నేహితుడు విష్ణు(అవినాష్‌ చౌదరి) మనస్పర్థాల కారణంగా దూరం అయిన తన ప్రేయసి పద్మను తంటాలు ప‌డుతుంటాడు. చివరకు మూడు జంట‌ల ప్రేమ‌క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.
తుర‌మ్‌ఖాన్‌లు సినిమాకు వినోద్‌ యాజమాన్య, అఖిలేష్‌ గోగు రియాన్ మ్యూజిక్ అందించారు. తురుమ్‌ఖాన్‌లు మూవీ కంటే ముందు మ‌ది, ఉత్త‌ర‌, సాఫ్ట్‌వేర్ బ్లూస్ అనే సినిమాలు చేశాడు శ్రీరామ్ నిమ్మ‌ల‌.

 

Advertisement

తాజావార్తలు

Advertisement