Telugu OTT | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం క్రైమ్ కామెడీ మూవీ – టీవీ దొంగతనంలో ట్విస్ట్‌లు
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కామెడీ డ్రామా మూవీ తిమ్మరాజు పల్లి టీవీ ఓటీటీలోకి రాబోతుంది. సాయితేజ్,వేద జలంధర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏ ఓటీటీలో..ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
Entertainment | Published On May 7, 2026, 11.56 am IST
Telugu OTT | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన లేటెస్ట్ రూరల్ కామెడీ డ్రామా మూవీ తిమ్మరాజు పల్లి టీవీ విభిన్నమైన ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిన్న సినిమాతో పలువురు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సాయితేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన తిమ్మరాజు పల్లి టీవీ మూవీకి మునిరాజ్ దర్శకత్వం వహించాడు.
ఆహా ఓటీటీలో...
తాజాగా తిమ్మరాజు పల్లి టీవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 15 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఆహా గోల్డ్ యూజర్లు ఓ రోజు ముందుగానే ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు ఆహా ఓటీటీ ప్రకటించింది.పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో...1980, 90 దశకంలో టీవీతో ప్రజలకు ఉన్న అనుబంధానికి క్రైమ్ ఎలిమెంట్, లవ్‌స్టోరీని జోడించి దర్శకుడు మునిరాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు. కిరణ్ అబ్బవరం నిర్మాత కావడంతోనే ఈ చిన్న సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. దర్శకుడు రాసుకున్న కథ చాలా చిన్నదైపోవడం, ఉత్కంఠగా చెప్పడంలో తడబడటంతో తిమ్మరాజు పల్లి టీవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాదాపు ఐదు కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను కిరణ్ అబ్బవరం నిర్మించారు. థియేటర్లలో రెండున్నర కోట్ల లోపే వసూళ్లను దక్కించుకుంది.
టీవీ దొంగ ఎవరంటే?
తిమ్మరాజు పల్లిలో రాజప్ప తొలిసారి టీవీ కొంటాడు. ఊరంతా రాజప్పను సెలిబ్రిటీగా చూస్తుంటారు. టీవీ చూడటానికి ప్రతి రోజు రాజప్ప ఇంటికి వచ్చే సతీష్ రాజప్ప చెల్లెలు శారదతో ప్రేమలో పడతాడు. చెల్లెలి ప్రేమ విషయం తెలిసి సతీష్ తో రాజప్ప గొడవ పడతాడు. అదే రోజు రాజప్ప ఇంట్లో దొంగలు పడి టీవీని ఎత్తుకెళతారు. ఆ దొంగతనం సతీష్‌పై పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? టీవీ ఎత్తుకెళ్లిన అసలు దొంగ ఎవరు? అతడిని సతీష్ పట్టుకున్నాడా? తనపై పడిన నిందను తొలగించుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



