గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి రెండోరోజున పెద్దఎత్తున సందర్శకులు
Telangana Rising | రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను గురువారం పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు సందర్శించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఈ స్టాళ్లను దర్శించడానికి బారులు తీరారు.
Telangana Rising | రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను గురువారం పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు సందర్శించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఈ స్టాళ్లను దర్శించడానికి బారులు తీరారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు “డిస్కవర్ తెలంగాణ: కల్చరల్ హెరిటేజ్ అండ్ నెక్స్ట్–జెన్ టూరిజం” అనే సదస్సుతో ప్రారంభమైంది. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ చరిత్ర, మ్యూజియం, సంస్కృతి, పర్యాటక అభివృద్ధి, ఆహార సంస్కృతి తదితర విభిన్న కోణాల్లో విలువైన విశ్లేషణలను ఈ సదస్సులో పాల్గొన్న వక్తలు వివరించారు. తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఒక సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను వీరు వివరించారు. ఈ సదస్సులో డా. మామిడి హరి కృష్ణ, బిరుదు రాజారామ్, పి. పద్మావతి, గోపీ బైల్లుప్పాల తదితరులు పాల్గొని మాట్లాడారు.
అనంతరం "తెలంగాణ రైజింగ్- ఎంపవరింగ్ ఆల్, గ్రోవింగ్ టుగెదర్" అనే సదస్సులో ప్రముఖులు విద్యార్థులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా చేపట్టిన ప్రగతి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై క్లుప్తంగా వివరించారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.
సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్, మూసీ రివర్ డెవలప్మెంట్, హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రీ, చేర్యాల పెయింటింగ్స్, సైబర్ క్రైమ్ ఛేదనలో ఉపయోగించే పలు ఆధునాతన పరికరాలు, డ్రోన్స్, రోబో తదితర 27 కు పైగా స్టాళ్లను సందర్శకులు అత్యంత ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా, ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటలవరకు ఈ గ్లోబల్ సదస్సు ను సందర్శించవచ్చని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






